Sonu Sood : పేద విద్యార్థులకు అండగా రియల్ హీరో..

ఐఏఎస్ కావాలని కలలుకనే పేద విద్యార్థుల కోసం సోనూ సూద్ కీలక నిర్ణయం తీసుకున్నారు..

Sonu Sood : పేద విద్యార్థులకు అండగా రియల్ హీరో..

Sonu Sood

Updated On : June 12, 2021 / 2:23 PM IST

Sonu Sood: కరోనా కష్ట కాలంలో ఎంతోమందికి సాయమందిస్తూ రియల్ హీరోగా, సహాయం పొందిన వారి పాలిట దేవుడిగా మారిన సోనూ సూద్ ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఐఏఎస్ కావాలని కలలుకనే పేద విద్యార్థుల కోసం సోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

KTR-Sonu Sood : నిజంగా సోనూసూద్ ‘సూపర్ హీరో’ – మంత్రి కేటీఆర్

ఐఏఎస్ కావాలనుకుని, కోచింగ్ తీసుకోవడానికి స్థోమతలేని ఔత్సాహిక విద్యార్థులకు ప్రోత్సాహకంగా వారికి స్కాలర్‌షిప్స్ అందించబోతున్నట్లు ప్రకటించారు. స్కాలర్‌షిప్స్ కోసం www.soodcharityfoundation.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సోనూ సూద్ తెలిపారు.

‘సంభవం’ పేరుతో సోనూ సూద్ ఉచిత ఐఏఎస్ కోచింగ్ మరియు స్కాలర్‌షిప్స్ అందిచనున్నారు. అలుపు లేకుండా ఆపదలో ఉన్న వారికి నిరంతరం సాయమందిస్తున్న రియల్ హీరో సోనూ సూద్‌ను అందరూ అభినందిస్తున్నారు.