IMDb Top 3 Rated Movie : ‘ఆకాశమే హద్దు’ గా సూర్య, సుధ కొంగర సినిమా.. ప్రపంచంలోనే మూడో స్థానం..

తెలుగు గడ్డపై పుట్టి తమిళనాట దర్శకురాలిగా గుర్తింపు పొందిన సుధ కొంగర ‘సూర‌రై పోట్రు’(ఆకాశం నీ హ‌ద్దురా) సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు..

IMDb Top 3 Rated Movie : ‘ఆకాశమే హద్దు’ గా సూర్య, సుధ కొంగర సినిమా.. ప్రపంచంలోనే మూడో స్థానం..

Imdb Top 3 Rated Movie

Updated On : May 14, 2021 / 3:47 PM IST

IMDb Top 3 Rated Movie: తెలుగు గడ్డపై పుట్టి తమిళనాట దర్శకురాలిగా గుర్తింపు పొందిన సుధ కొంగర ‘సూర‌రై పోట్రు’(ఆకాశం నీ హ‌ద్దురా) సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.. ఇరుదుసుట్రు (తమిళ్’, సాలఖడూస్ (హిందీ) సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో ‘గురు’ పేరుతో రీమేక్ చేసి టాలెంటెడ్ డైరెక్టర్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు.

సాధారణంగా స్టార్ హీరోతో సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి సహజం.. కానీ సూర్య లాంటి స్టార్ అండ్ వెర్సటైల్ యాక్టర్‌తో ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ అధినేత ఆటోబయోగ్రఫీ ‘సింప్లి ఫ్లై’ ఆధారంగా ‘సూరరై పోట్రు’.. (ఆకాశం నీ హద్దురా) సినిమా చెయ్యడం అంటే సాహసమనే చెప్పాలి.. ఆమె ధైర్యానికే ఈరోజు ఈ సినిమాకి నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్లో ఇంతటి మంచి పేరు వస్తోంది..

Soorarai Pottru : షాంఘై ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘సూర‌రై పోట్రు’..!

రీసెంట్‌గా IMDB రేటింగ్స్‌లో ‘సూరరై పోట్రు’ టాప్ 3 ప్లేస్ దక్కించుకుంది.. హాలీవుడ్ మూవీ The Shawshank Redemption, The Godfather సినిమాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. వాటి తర్వాత సూర్య మూవీ ఉండడం విశేషం. అలాగే 48 వేల మంది 10 స్టార్ రేటింగ్ ఇచ్చారు.. మొత్తంగా 59674 ఓట్లు వచ్చాయి..

ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ బరిలో మ‌న‌దేశం త‌ర‌పున ఈ చిత్రం 93వ ఆస్కార్ నామినేష‌న్స్ ప‌రిశీల‌న‌కు ఎంపికైన సంగ‌తి తెలిసిందే. అలాగే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు కూడా ఈ సినిమా ఎంపికైంది. షాంఘై ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎస్ఐఎఫ్ఎఫ్‌)లో ప్ర‌ద‌ర్శితం కానుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20వ‌ర‌కు జ‌రిగే చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ప‌నోర‌మ కేటగిరీల ఈ చిత్రాన్ని సెలెక్ట్ చేశారు.

Soorarai Pottru