Reverse situation : బోనులో మనుషులు..చూడటానికి వచ్చిన సింహాలు
బోనులో ఉండాల్సిన సింహాలు స్వేచ్చగా బయట తిరుగుతున్నాయి. బయట ఉండాల్సిన మనుషులు జంతువుల్లా బోనులో ఉన్నారు.బోనులో ఉన్న మనుషుల్ని చూడటానికి సింహాలు వచ్చాయి

Reverse Situation(1)
GG Forest Lions Cage : బోనులో ఉండాల్సిన సింహాలు స్వేచ్చగా బయట తిరుగుతుంటే..బయట ఉండాల్సిన మనిషి మాత్రం బోనులో ఉన్నాడు. ఇదొక విచిత్రమైన ఘటన. బోనులో ఉన్న మనిషిని చూడటానికి స్వేచ్చగా తిరిగే సింహాలు వచ్చాయి. ఈ బోనులోఉన్నది ఎవరబ్బా అంటూ ఆసక్తిగా తిలకిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటీ సింహాలు ఉండాల్సింది బోనులో..బయట ఉండాల్సింది మనిషి కానీ ఇదేదో రివర్స్ గా ఉందే ఎక్కడా?ఏంటా విశేషం అంటారా? దక్షిణాఫ్రికాలోని ఇటువంటి సీన్ కనిపిస్తోంది. దీన్ని చూస్తే..సింహాన్ని చూడ్డానికి మనం జూకు వెళ్తాం.. సింహానికే మనల్ని చూడాలనిపించింది అనుకోండి.. ఇదిగో ఈ రివర్స్ జూకు వస్తుంది..అన్నట్లుగా ఉంది ఆ సీన్…!
సింహం. అడవికి మృగరాజు. అది అడవిలో ఉన్నా..బోనులో ఉన్నా అది సింహం సింహమే. సింహాన్ని చూడాలంటే జూకి వెళతాం. ఎందుకంటే అడవిలో స్వేచ్ఛగా తిరిగే సింహాల్ని చూసే ధైర్యం ఉండదు కాబట్టి. అందుకే సింహాన్ని చూడ్డానికి మనం జూకు వెళ్తాం..కానీ ఓ డిఫరెంట్ థింక్… సింహానికే మనల్ని చూడాలనిపించింది అనుకోండి.. ఇదిగో ఈ రివర్స్ జూకు వస్తుంది..అంటే.. జంతువులు బయట తిరుగుతూ ఉంటే..మనుషులు బోనులో ఉండటమన్నమాట…ఈ వింత వినూత్న కాన్సెప్ట్ దక్షిణాఫ్రికాలోని హారిస్మిత్‌లో ఉన్న జీజీ సింహాల అభయారణ్యం నిర్వాహకులకు వచ్చింది.దీంతో ఈ వినూత్న ఏర్పాటు చేశారు.
దక్షిణాఫ్రికాలోని హారిస్మిత్‌లో ఉన్న జీజీ సింహాల అభయారణ్యంలో ఈ వినూత్న బోనును ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీని వల్ల సందర్శకులకు కూడా సింహాలను ఇతర జంతువులను అత్యంత దగ్గర నుండి చూసే అనుభూతి కలుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే బోనులో ఉండేవారి భద్రతు ఎటువంటి ఢోకా లేదంటున్నారు. అన్ని రకాలుగా సేఫ్టీ చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. ఎటువంటి భయాలూ పెట్టుకోకుండా ఈ వినూత్న ఏర్పాటుని ఎంజాయ్ చేవచ్చని చెబుతున్నారు. సేఫ్టీ విషయంలో తరచూ ఇంజనీర్లతో తనిఖీలు చేయిస్తామని అంటున్నారు.