Trains Cancellation : కరోనా ఎఫెక్ట్.. 55 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో నడిచే 55 రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లను ఈ నెల 21 నుంచి 24 వరకు రద్దు చేస్తున్నట్లు ఇంతకు ముందు ప్రకటించింది.

Train 11zon
South Central Railway : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 55 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన వాటిలో ఎక్కువగా ప్యాసింజర్, మెయిల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు ఉన్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో నడిచే 55 రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లను ఈ నెల 21 నుంచి 24 వరకు రద్దు చేస్తున్నట్లు ఇంతకు ముందు ప్రకటించింది. తాజాగా ఈ నెల 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.