South Indian Film News : చరణ్ క్యారెక్టర్ చనిపోతుందా?.. పూరితో రాకింగ్ స్టార్..!

‘కె.జి.యఫ్ 2’ తర్వాత రాకింగ్ స్టార్ యష్.. ‘లైగర్’ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలవనున్నారని టాక్.. ఓ పొలిటికల్ థ్రిల్లర్ కథతో పూరీ జగన్నాథ్ - యష్ సెట్స్ పైకెళ్లనున్నారని తెలుస్తోంది..

South Indian Film News : చరణ్ క్యారెక్టర్ చనిపోతుందా?.. పూరితో రాకింగ్ స్టార్..!

South Indian Film News Roundup

Updated On : June 1, 2021 / 1:59 PM IST

South Indian Film News: ఈమధ్యే ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో రిలీజ్ డేట్ మార్చలేదు రాజమౌళి. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్‌లో వచ్చేలా లేదంటున్నారు. ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన మేజర్ సీక్వెన్స్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందని.. అది పూర్తి అయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు టైం పడుతుందని చెప్తున్నారు. అంతేకాదు, ఈ మూవీ మెయిన్ లీడ్స్ ఎన్టీఆర్, చరణ్, ఆలియా.. కరోనా బారిన పడి కోలుకోన్నా.. ఇప్పట్లో ‘ఆర్ఆర్ఆర్’ లోకేషన్‌లో షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.

మే నుంచి వాయిదా పడిన మెగాస్టార్ ‘ఆచార్య’ పరిస్థితులు చక్కబడితే ఆగస్టులో వచ్చేందుకు ట్రై చేస్తోంది. అయితే లేటెస్ట్‌గా ఈ మూవీలో రామ్ చరణ్ రోల్ హైలైట్ కానుందని డైరెక్టర్ కొరటాల అనౌన్స్ చేశారు. ఇంటర్వెల్ ముందు సిద్ధగా ఎంట్రీ ఇచ్చే చరణ్.. సెకండాఫ్ మొత్తం రప్ఫాడిస్తారని చెప్పుకొచ్చారు. రెండు పాటలతో పాటు, ఎమోషనల్ సీన్స్‌తో హైలైట్ కానున్నారు రామ్ చరణ్. ఆయన పాత్ర చనిపోతుంది కానీ అది చిరు ఒడిలో కాదనే సంకేతాలు అందుతున్నాయి. ఇందులో ఓ కాజ్ కోసం పోరాడే యోధులుగా కనిపించనున్నారు చిరు, చరణ్.

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘సలార్’ లో జ్యోతిక ఎంట్రీ ఇవ్వనుంది. ముందు ఈ సినిమాలో ప్రభాస్ అక్కగా రమ్యకృష్ణను అనుకున్నా చివరికి జ్యోతికను ఫిక్స్ చేశారు మేకర్స్. సెకండ్ వేవ్ పాండమిక్ కంట్రోల్ కొచ్చాక జ్యోతిక పోర్షన్‌ను తెరకెక్కించనున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఇదే సినిమాలో ప్రభాస్ విలన్‌గా జాన్ అబ్రహాం ఫిక్సయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

‘కె.జి.యఫ్ 2’ తర్వాత రాకింగ్ స్టార్ యష్.. ‘లైగర్’ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలవనున్నారని టాక్. ఓ పొలిటికల్ థ్రిల్లర్ కథతో పూరీ జగన్నాథ్ – యష్ సెట్స్ పైకెళ్లనున్నారని తెలుస్తోంది. ‘లైగర్’ తర్వాత ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాగానే రూపొందించనున్నారు పూరీ జగన్నాథ్. అటు కన్నడ రాక్ స్టార్ ఈ ప్రాజెక్ట్‌తో మరో మైల్ స్టోన్ చేరుకునేందుకు చూస్తున్నారని అంటున్నారు.

ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ – ఆలియా జంట మరోసారి వర్కౌట్ చేయనుందని సమాచారం. శంకర్ – చరణ్ కాంబో పాన్ ఇండియా మూవీ కోసం ఆలియాను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ట్రిపుల్ ఆర్ తో జోడి ఫేమస్ అవుతుంది కాబట్టి వీళ్లకి కలిసొస్తుందనేది ప్లాన్. మరోవైపు ‘భారతీయుడు 2’ రీస్టార్ట్ కన్నా చరణ్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకే శంకర్ ట్రై చేస్తున్నారనే వార్త జోరందుకుంది.