Sri Lanka: మాల్దీవుల్లోనూ గొటబాయ రాజపక్సను వదలని ఆందోళనకారులు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు మాల్దీవుల్లోనూ నిరసనల సెగ తప్పట్లేదు. గొటబాయ రాజపక్స రాజీనామా చేయకుండానే కుటుంబ సభ్యులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయిన విషయం తెలిసిందే. మాల్దీవుల్లో ఉంటోన్న శ్రీలంక దేశస్థులు నిరసన తెలిపారు. గొటబాయ రాజపక్స తిరిగి శ్రీలంకకు వెళ్ళిపోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు

Srilankan
Sri Lanka: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు మాల్దీవుల్లోనూ నిరసనల సెగ తప్పట్లేదు. గొటబాయ రాజపక్స రాజీనామా చేయకుండానే కుటుంబ సభ్యులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయిన విషయం తెలిసిందే. గొటబాయ రాజపక్స శ్రీలంక విడిచి పారిపోయినప్పటికీ ఆయనను ఆందోళనకారులు విడవట్లేదు. మాల్దీవుల్లో ఉంటోన్న శ్రీలంక దేశస్థులు నిరసన తెలిపారు. గొటబాయ రాజపక్స తిరిగి శ్రీలంకకు వెళ్ళిపోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి
శ్రీలంక జాతీయ జెండా, పలు ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. గొటబాయ రాజపక్స రాజీనామా చేయాల్సిందేనని శ్రీలంక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కూడా తలెత్తడంతో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఓ వైపు పేదలకు ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆందోళనల వల్ల తరుచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Protest in Maldives for giving refuge to Sri Lanka’s President Gotabaya Rajapaksa! pic.twitter.com/JLyel1JHfb
— Ashok Swain (@ashoswai) July 13, 2022