నా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి: వరలక్ష్మీ శరత్‌కుమార్

  • Published By: sekhar ,Published On : December 3, 2020 / 12:29 PM IST
నా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి: వరలక్ష్మీ శరత్‌కుమార్

Updated On : December 3, 2020 / 12:55 PM IST

Varalaxmi Sarathkumar: ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు, తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్, విలన్ క్యారెక్టర్లలో ప్రేక్షకులను అలరించిన పాపులర్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఈ విషయం తెలుపుతూ తాజాగా ఆమె ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.


‘గత రాత్రి నా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్‌కి గురయ్యాయి. నా అకౌంట్స్ రికవర్ చేయాల్సిందిగా సంబంధిత టీంలను కోరాను. కొద్దిరోజుల సమయం పడుతుందని చెప్పారు. నా ఫాలోవర్స్, శ్రేయోభిలాషులు.. నా అకౌంట్స్ ద్వారా వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి. అకౌంట్స్ తిరిగి వచ్చాక అప్‌డేట్ చేస్తాను. త్వరలో మిమ్మల్నందర్నీ ఆన్‌లైన్‌లో కలుస్తాను’ అని లేఖలో పేర్కొంది వరలక్ష్మీ శరత్ కుమార్.

Varalaxmi Sarathkumar