‘స్మిత్ మళ్లీ దొరికిపోయాడు.. జీవితకాలం బ్యాన్ చేసినా సరిపోదు’

‘స్మిత్ మళ్లీ దొరికిపోయాడు.. జీవితకాలం బ్యాన్ చేసినా సరిపోదు’

Updated On : January 11, 2021 / 12:14 PM IST

Steve Smith: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి సమస్యల్లో ఇరుక్కున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సోమవారం జరిగిన చివరి రోజు మ్యాచ్‌లో నేలను గీకుతూ కనిపించాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా వచ్చిన గ్యాప్ లో ఇలా జరిగింది.

డ్రింక్స్ బ్రేక్ పూర్తయ్యాక తిరిగొచ్చన పంత్ మళ్లీ గార్డ్ చేసుకున్నాడు. ఆ వీడియోల్లో గార్డ్ చెరిపేస్తున్న స్టీవ్ స్మిత్ నెం.49 జెర్సీ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుండటంతో నెటిజన్లు మరోసారి స్మిత్ చిల్లరపనులు చేశాడు. సంవత్సర కాలం వేసిన బ్యాన్ సరిపోలేదు. జీవిత కాలం బ్యాన్ చేయాలంటూ తిట్టిపోస్తున్నారు.

ఐసీసీ దీనిని గమనిస్తే.. ఆ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌కు ఛార్జ్ తప్పదు. స్మిత్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం తొలిసారేం కాదు. 2018లో కెప్టెన్ గా ఉన్న సమయంలో దక్షిణాఫ్రికాతో ఆడుతూ.. బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడు.

అప్పటికీ ఇండియా మరో 200పరుగులు చేసి గెలవాల్సి ఉంది. ఇండియాపై బ్యాటింగ్, బౌలింగ్‌లలోనూ ఆస్ట్రేలియా బాగానే రాణిస్తుంది.