Super Star Krishna: JRC, N కన్వెన్షన్స్‌లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని నవంబర్ 27న హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ అభిమాన నటుడు మృతి చెందడంతో కృష్ణ అభిమానులు ఆయన్ను చివరిసారి చూసేందుకు ఆయన అంత్యక్రియల సమయంలో భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే అందరూ కృష్ణ గారిని కడసారి చూడలేకపోయారు. దీంతో వారి కోసం కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు.

Super Star Krishna: JRC, N కన్వెన్షన్స్‌లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ

Super Star Krishna Pedda Karma To Be Held At JRC Convention

Updated On : November 26, 2022 / 6:40 PM IST

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని నవంబర్ 27న హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ అభిమాన నటుడు మృతి చెందడంతో కృష్ణ అభిమానులు ఆయన్ను చివరిసారి చూసేందుకు ఆయన అంత్యక్రియల సమయంలో భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే అందరూ కృష్ణ గారిని కడసారి చూడలేకపోయారు. దీంతో వారి కోసం కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు.

Super Star Krishna : దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు.. సూపర్‌స్టార్‌ కృష్ణ లైఫ్ స్టోరీ..

నవంబర్ 27న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో ఉదయం 10 గంటలకు కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కార్మికులు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తమ అభిమాన హీరోకు నివాళులు అర్పించేందుకు అభిమానులు కూడా ఈ పెద్ద కర్మకు భారీగా హాజరుకానున్నారు. తమ అభిమాన నటుడికి సంతాపం తెలిపేందుకు దాదాపు 5 వేల మంది అభిమానులు ఈ పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

Super Star Krishna Passed Away: కృష్ణ భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి.. కన్నీరు పెట్టుకున్న చిరంజీవి..

ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఎన్ కన్వెన్షన్స్‌లో కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణ గారి సోదరుడు ఆదిశేషగిరి రావు, కుమారుడు మహేష్ బాబులతో పాటు ఘట్టమనేని కుటుంబ సభ్యులు కూడా హాజరవుతారు.