Sitara – Mahesh Babu : సితార పాపతో సూపర్‌స్టార్ క్యూట్ పిక్..
నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్ - సితార పాపను ఆప్యాయంగా హత్తుకున్న పిక్ పోస్ట్ చేశారు..

Super Star Mahesh Babu Cute Pic With Daughter Sitara
Sitara – Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. ఈ ఖాళీ సమయాన్ని పిల్లలతో సరాదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు మహేష్. పిల్లలతో కలిసి తాను పిల్లాడిలా మారిపోయి ఎంజాయ్ చేసే మహేష్.. వీలు దొరికినప్పుడల్లా వారిని విదేశాలకు టూర్లకు తీసుకెళ్తుంటారు.. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకి వెళ్లే వీలు లేకపోవడంతో చక్కగా ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు.
View this post on Instagram
మహేష్ పిలల్లతో కలిసి ఉన్న లవ్లీ పిక్స్‌ను మంచి మంచి కొటేషన్స్‌తో సతీమణి నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. రీసెంట్‌గా నమ్రత పోస్ట్ చేసిన పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..
View this post on Instagram
మహేష్ బాబుని తమ గారాలపట్టీ సితార పాప హత్తుకుని పడుకున్న ఫొటో, మహేష్, నమ్రత పిల్లలను ఎత్తుకున్న పిక్స్ షేర్ చెయ్యగా వైరల్ అయ్యాయి.. శనివారం నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్ – సితార పాపను ఆప్యాయంగా హత్తుకున్న పిక్ పోస్ట్ చేశారు. ఈ క్యూట్ పిక్ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు, నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటుంది.
View this post on Instagram