దుబాయ్‌కి మహేష్ ఫ్యామిలీ.. ఎందుకంటే..

దుబాయ్‌కి మహేష్ ఫ్యామిలీ.. ఎందుకంటే..

Updated On : January 21, 2021 / 6:46 PM IST

Mahesh Babu Family: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లాడు.. అయితే అక్కడ పర్సనల్‌తో పాటు ప్రొఫెషన్ వర్క్ కూడా చెయ్యబోతున్నాడు. జనవరి 22 నమ్రత పుట్టినరోజుని దుబాయ్‌లో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. తర్వాత నమ్రత, గౌతమ్, సితార ఇండియా తిరిగొచ్చేస్తారు.

Mahesh Babu

ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమవుతోంది. అక్కడ దాదాపు 50 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం మహేష్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు..

Mahesh Babu

కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మహేష్ కెరీర్లో మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా లెవల్లో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

Mahesh Babu