N.V.Ramana: రేపు యాదాద్రి ఆలయానికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్!
తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మంగళవారం ఉదయం యాదాద్రి ఆలయానికి రానున్నారు.

Supreme Court Chief Justice To Visit Yadadri Temple Tomorrow
N.V.Ramana: తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మంగళవారం ఉదయం యాదాద్రి ఆలయానికి రానున్నారు. రేపు ఉదయం 8:30 గంటలకు యాదాద్రి ఆలయానికి చేరుకోనున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఉదయం 8.45 నిమిషాల నుండి 9.15 నిమిషాల మధ్య నరసింహస్వామిని దర్శించుకోనున్నారు.
అనంతరం 9.15 గంటల నుండి 9.45 గంటల వరకు పునర్నిర్మాణమైన ఆలయాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత 9.45 నిమిషాల నుండి 10 గంటల వరకు వీవీఐపీ గెస్ట్ హౌస్ లో అల్పాహారం తీసుకోనున్న సీజేఐ 10 గంటలకు యాదాద్రి ఆలయం నుండి తిరుగు పయనం కానున్నారు.