Afghanistan : అందరికీ క్షమాభిక్ష పెట్టేశాం.. వచ్చి పని చేసుకోండి – తాలిబన్లు
అఫ్గానిస్తాన్ ప్రజలందరికి క్షమాబిక్ష పెట్టినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.ప్రజలు ఎవరి పనులు వారు చేసుకోవచ్చని ఓ ప్రకటన విడుదల చేసింది.

Afghanistan
Afghanistan : అఫ్గానిస్తాన్ ప్రజలందరికి క్షమాబిక్ష పెట్టినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.ప్రజలు ఎవరి పనులు వారు చేసుకోవచ్చని ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ప్రకటించింది తాలిబన్ ప్రభుత్వం. పూర్తి విశ్వాసం, భద్రతతో ప్రజలంతా జీవించొచ్చనని తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా కాబూల్ ను స్వాధీనం చేసుకున్న రెండు రోజుల తర్వాత తాలిబన్లు ఈ ప్రకటన చేశారు.
మరోవైపు ఆ దేశ ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విమాన సర్వీసులు నిలిపివేయడంతో కాబూల్ ఎయిర్ పోర్ట్ లో నిరీక్షిస్తున్నారు. మరికొందరు అఫ్గాన్ సరిహద్దు దేశాల్లోకి అక్రమంగా చొరబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తజఖిస్తాన్ తమ సరిహద్దును పూరిగా మూసివేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది.
మరోవైపు అఫ్గాన్ లో పరిస్థితి భయానకంగా ఉండటంతో అక్కడ నివాసం ఉంటున్న ఇతర దేశాల ప్రజలను ఆయా దేశాలు తీసుకెళ్తున్నాయి. తాజాగా భారతీయులను తరలించేందుకు వాయుసేన విమానాలు పంపింది. అఫ్గాన్ లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు కాబుల్ గురుద్వారాలో ఉన్న భారతీయులను తరలిస్తోంది. అమెరికాతోపాటు, మరికొన్ని దేశాలు తమ పౌరులను తరలిస్తున్నాయి.