BJP Public Meeting In Telangana : ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ..హాజరుకానున్న అమిత్ షా

ఆగస్టు 21న  మునుగోడులో  బీజేపీ భారీ బహిరంగ సభ జరుగుతుందని.. ఈ సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరు అవుతారని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుక్ ప్రకటించారు.

BJP Public Meeting In Telangana : ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ..హాజరుకానున్న అమిత్ షా

BJP Public Meeting In Telangana Korutla (1)

Updated On : August 17, 2022 / 3:00 PM IST

BJP Public Meeting In Telangana Korutla : ఆగస్టు 21న  మునుగోడులో  బీజేపీ భారీ బహిరంగ సభ జరుగుతుందని.. ఈ సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరు అవుతారని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుక్ ప్రకటించారు.  ఈ సందర్భంగా  తరుణ్ చుక్ టీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామాన్యాన్ని అపహాస్యం చేస్తోందని సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై నమ్మకం లేదు అంటూ విమర్శించారు.

ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారని..కానీ కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వటంలేదంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సింది అంతా ఇస్తోందని కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు అన్యాయం చేస్తోంది అంటూవిమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.తెలంగాణలో బీజేపీ నేతలపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఇది సరైంది కాదంటూ తరుణ్ చుక్ సూచించారు. బీజేపీ చేస్తోన్న ప్రజా సంగ్రామ యాత్రకు అవరోధాలు కల్పిస్తూ బీజేపీ నేతలపై దాడులు చేయిస్తోంది అంటూ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన తరుణ్ చుక్ అందుకే కేసీఆర్ కు తన చేతుల్లోంచి అధికారం పోతుందనే భయంతోనే ఈ దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపించారు.

తెలంగాణ పోలీసులు బీజేపీ నేతల విషయంలో వ్యవహరించే తీరు సరిగాలేదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అండతో పోలీసులు ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్ షా చేతుల మీదుగా బీజేపీలో చేరనున్నారు.