KCR Fire : కృష్ణానీటి విషయంలో ఆంధ్రా దాదాగిరి చేస్తోంది : కేసీఆర్

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలు చిచ్చు పెట్టాయి. నీటి విషయంలో ఏపీ,తెలంగాణాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వివాదంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రా దాదాగిరి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KCR Fire : కృష్ణానీటి విషయంలో ఆంధ్రా దాదాగిరి చేస్తోంది : కేసీఆర్

Cm Kcr Fire On Ap Govt On Krishna River Water Issue

Updated On : August 2, 2021 / 3:41 PM IST

Telangana cm kcr fire on ap govt on krishna river water Issue : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలు చిచ్చు పెట్టాయి. నీటి విషయంలో ఏపీ,తెలంగాణాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల నేతలు మాటల తూటాలు సంధించుకుంటున్నారు. ఈ విషయంలో సీఎంలిద్దరు కూర్చుని చర్చించుకుంటే సమస్యకు పరిష్కారం దొరకొచ్చు. కానీ ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈక్రమంలో కృష్ణా జ‌లాల వివాదంపై నాగార్జున సాగ‌ర్ వేదిక‌గా సీఎం కేసీఆర్ స్పందించారు. హాలియాలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ ఏపీపై విరుచుకుపడ్డారు.

రెండు రాష్ట్రాలకు చెందిన కృష్టా జలలా విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆంద్రా ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిపై ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ వివాదంపై కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ వ్య‌తిరేకంగా వ్యవహరిస్తోందనీ..దీన్ని ఆధారంగా చేసుకుని తెలంగాణపై ఆంధ్రా వాళ్లు దాదాగిరీ చేస్తున్నారని అన్నారు. కృష్ణా న‌దిపై ఏ విధంగా అక్ర‌మ ప్రాజెక్టులు క‌డుతున్నారో ప్ర‌జ‌లంద‌రూ చూస్తునే ఉన్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారు కాబట్టి సమన్వయంతో ముందుకు సాగాలని..ఇరు రాష్ట్రాలు సమస్యశ్యామలంగా ఉండాలని అన్నారు.

కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మనకు ఇబ్బంది జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పెద్ద‌దేవుల‌ప‌ల్లి చెరువు వ‌ర‌కు పాలేరు రిజ‌ర్వాయ‌ర్ నుంచి గోదావ‌రి నీళ్ల‌ను తెచ్చి అనుసంధానం చేయాల‌నే స‌ర్వే జ‌రుగుతోందని..అది పూర్త‌యితే నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టు పొలాలు పంటలతో కళకళలాడతాయని తెలిపారు. పెద్ద‌దేవుల‌ప‌ల్లి – పాలేరు రిజ‌ర్వాయ‌ర్ అనుసంధానం చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు.