Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
మంగళవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల్ని విడుదల చేస్తారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రెండూ ఒకేసారి విడుదలవుతాయి.

Intermediate Results
Intermediate Results: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం (జూన్ 28న) విడుదల కానున్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు దీనిపై ఆదివారం ప్రకటన చేసింది. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల్ని విడుదల చేస్తారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రెండూ ఒకేసారి విడుదలవుతాయి. ఫలితాలు విడుదలైన 15 రోజుల్లోనే.. ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలు గత మే 6న ప్రారంభమయ్యాయి.
Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
అదే నెల 24న ముగిశాయి. పరీక్షలు ముగిసిన నెల రోజుల తర్వాత ఫలితాల్ని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు అందరూ కలిసి దాదాపు 9 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాల్ని తెలుసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.