రోడ్లపైకి 75 శాతం సిటీ బస్సులు!

Bus:కరోనా కారణంగా ఇప్పటివరకు నిలిచిపోయిన అనేక వ్యవస్థలు ఇప్పుడు క్రమక్రమంగా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా కారణంగా ఆగిపోయిన సిటీ బస్సులు 50శాతం ఇప్పటికే నగరంలో తిరుగుతూ ఉండగా.. సిటీ బస్సులను 75 శాతానికి పెంచేందుకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారు.
ఈమేరకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేయగా.. ఆర్టీసీ స్థితిగతులపై ప్రగతి భవన్‌లో కేసీఆర్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించినట్లుగా పువ్వాడ తెలిపారు. సిటీ సర్వీసులు పెరగడం వల్ల నగర ప్రయాణికుల ఇబ్బందులు తగ్గుతాయని, ఇప్పుడు ఉన్న పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.