KGF2: పుష్పతో పెట్టుకుంటారా.. అంటూ యశ్ పరువు తీసిన తెలుగు మీడియా!
ఒక భారీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ పలు ప్రెస్ మీట్స్ పెట్టి, తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కామన్. అయితే కొన్నిసార్లు ఈ ప్రెస్ మీట్స్ కొత్త వివాదాలకు.....

Telugu Media Tit For Tat On Yash For Late
KGF2: ఒక భారీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ పలు ప్రెస్ మీట్స్ పెట్టి, తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కామన్. అయితే కొన్నిసార్లు ఈ ప్రెస్ మీట్స్ కొత్త వివాదాలకు కేరాఫ్‌గా మారుతుంటాయి. ఇలాంటివి ఎక్కువగా మనం బాలీవుడ్‌లో చూస్తుంటాం. అయితే ఇటీవల దక్షిణాదిన కూడా ఇలాంటి ఘనటలు జరుగుతుండటంతో అసలు ప్రెస్ మీట్స్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది.
రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా సుకుమార్ మినహా చిత్ర యూనిట్ పలు భాషల్లో ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ సందడి చేసింది. అయితే కన్నడనాట మాత్రం ఈ చిత్ర సభ్యులకు ఊహించని ఘటన ఎదురైంది. ప్రెస్ మీట్‌కు అనుకున్న సమయానికంటే హీరో అల్లు అర్జున్ చాలా ఆలస్యంగా వచ్చాడు. దీంతో కన్నడ మీడియా అత్యత్సాహం ప్రదర్శించింది. అక్కడ ఒక విలేకరి బన్నీని.. ప్రెస్ మీట్ ఎప్పుడని చెప్పి ఎప్పుడు వచ్చారంటూ ప్రశ్నించారు. మీడియా మీద మీకు ఇలాంటి గౌరవం ఉందా అంటూ సదరు విలేకరి మండిపడ్డాడు. అయితే బన్నీ మాత్రం చాలా కూల్‌గా తనకు లేట్ అయ్యిందని.. అందుకు తాను అందరి ముందర సారీ చెప్పాడు.
Pushpa Craze: తగ్గేదే లే.. భజనలోనూ శ్రీవల్లి పాటే.. తబలా బీట్ వైరల్!
అయితే తెలుగు హీరోకు కన్నడ మీడియా చేసిన అవమానానికి, తెలుగు మీడియా తాజాగా రివెంజ్ తీర్చుకుంది. కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్2 చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ రెండు రోజులు పాట తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రెస్ మీట్స్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తిరుపతి, వైజాగ్‌లలో ప్రెస్ మీట్ నిర్వహించిన కేజీఎఫ్ చిత్ర హీరో యశ్‌కు కూడా సేమ్ అలాంటి చురకలే అంటించారు ఇక్కడి మీడియా వారు. తిరుపతి ప్రెస్ మీట్ ఉదయం 7 గంటలకు అని చెప్పి 8.30 గంటలకు వచ్చారు. వైజాగ్‌లోనూ మధ్యాహ్నం 11 గంటలకు అని చెప్పి 12.30కు వచ్చారు. దీంతో తెలుగు మీడియా ప్రతినిధులు కేజీఎఫ్ హీరో యశ్‌ను ఓ ఆట ఆడేసుకున్నారు.
KGF2: బాహుబలి2 రికార్డులు బ్రేక్.. హీరో గట్టిగానే ఇచ్చాడుగా!
మీరు ప్రెస్ మీట్‌కు చెప్పిన టైమ్ ఏమిటి.. మీరు వచ్చిన టైమ్ ఏమిటి అంటూ అడిగారు. దీంతో యశ్ వివరణ ఇచ్చాడు. తాను ఎక్కడికి వెళ్తున్నానో తనకు తెలియదని.. చిత్ర యూనిట్ తనను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడకు వెళ్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. ప్రెస్ మీట్‌కు పది నిమిషాలు ఆలస్యం అయినా అది తప్పే.. కనక కేజీఎఫ్ 2 చిత్ర యూనిట్ సభ్యుల తరఫున తాను సారీ చెబుతున్నానంటూ పేర్కొన్నాడు. ఏదేమైనా బన్నీని క్షమాపణలు చెప్పించిన కన్నడ మీడియాపై తెలుగు మీడియా ఈ విధంగా పగ తీర్చుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది.