Guinness World Records : అతిచిన్న వ్యాక్యూమ్ క్లీనర్..గిన్నీస్ రికార్డులో చోటుకు ధరఖాస్తు

పవన్ తయారు చేసిన వ్యాక్యూమ్ క్లీనర్ ను వెర్నియర్ కాలిపర్స్ తో కొలవగా 1.1సెం.మీ పొడవు, 1సెంమీ వెడల్పు ఉంది. దీనిని తయారు చేందుకు మైక్రో మోటర్, ఇంజన్షన్ సిరంజి, ఫ్యాన్ రెక్కల కోసం కోక్ టిన్ ముక్కలు, చిన్నసైజు బ్యాటరీలను పవన్ వినియోగించాడు.

Guinness World Records : అతిచిన్న వ్యాక్యూమ్ క్లీనర్..గిన్నీస్ రికార్డులో చోటుకు ధరఖాస్తు

Vaccum

Updated On : July 25, 2021 / 10:29 AM IST

Guinness World Records : అందరిలో తాము భిన్నంగా ఉండాలని కోరుకునే వారు కొందరు ఉంటారు. అలాంటి వారు ఏదో ఒకటి చేస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంటారు. ఆకోవలోకే చెందుతాడు ఖమ్మం జిల్లాకు చెందిన పవన్ కుమార్. గిన్నీస్ బుక్ లో చోటు కోసం అతి చిన్నదైన వ్యాక్యూమ్ క్లీనర్ ను తయారు చేశాడు. అతను తయారు చేసి వ్యాక్యుమ్ క్లీనర్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.

దుమ్ము, ధూళీ తొలగించుకునేందుకు వ్యాక్యూమ్ క్లీనరలను వినియోగిస్తుంటారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్ లు ఓ మోస్తరు సైజులో ఉంటాయి. కొన్ని చేతిలో పట్టుకునే వైతే మరికొన్ని పెద్దవిగా ఉంటాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోకవరం గ్రామానికి చెందిన చుండూరు పవన్ కుమార్ అతిచిన్న వ్యాక్యూమ్ క్లీనర్ ను తయారు చేశాడు.

పవన్ తయారు చేసిన వ్యాక్యూమ్ క్లీనర్ ను వెర్నియర్ కాలిపర్స్ తో కొలవగా 1.1సెం.మీ పొడవు, 1సెంమీ వెడల్పు ఉంది. దీనిని తయారు చేందుకు మైక్రో మోటర్, ఇంజన్షన్ సిరంజి, ఫ్యాన్ రెక్కల కోసం కోక్ టిన్ ముక్కలు, చిన్నసైజు బ్యాటరీలను పవన్ వినియోగించాడు. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి గతంలో 1.4 సెం.మీ పొడవుతో వ్యాక్యూమ్ క్లీనర్ తయారు చేయగా పవన్ ప్రస్తుతం తయారు చేసిన వ్యాక్యూమ్ క్లీనర్ దానికన్నా చిన్నది. ప్రస్తుతం అతిచిన్న వ్యాక్యూమ్ క్లీనర్ కు గిన్నీస్ బుక్ ఆప్ రికార్డ్స్ లో చోటు కోసం పవన్ ధరఖాస్తు చేశాడు.