మహాభారతం సీరియల్‌లోని సాంకేతిక లోపాలకు సంబంధించిన వీడియో వైరల్ 

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 11:39 AM IST
మహాభారతం సీరియల్‌లోని సాంకేతిక లోపాలకు సంబంధించిన వీడియో వైరల్ 

Updated On : May 10, 2020 / 11:39 AM IST

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో ప్రజలకు వినోదం అందించటం కోసం 1990లో ప్రజలన్ని భక్తి సాగరంలో పడేసిన మహాభారత్ సీరియల్ ని దూరదర్శన్ ఛానెల్ మార్చి 28, 2020 న తిరిగి ప్రసారం చేసింది. అప్పటి రోజుల్లోనే కాదు ఇప్పుడు కూడా ఈ సీరియల్ ప్రేక్షకుల ప్రశంసలను పొందుతుంది. ప్రస్తుతం ఈ సీరియల్ సాంకేతిక లోపాలకు  సంబంధించిన వీడియోలు టిక్ టాక్ లో వైరల్ అవుతున్నాయి.
TikTok User Spots A Dead Soldier Coming To Life In Mahabharat War Scene, Video Becomes A Hit!

మహాభారతం సీరియల్ ప్రదర్శనలో సమయంలో అభిమానులు  కొన్ని సాంకేతిక లోపాలను గుర్తించారు. ఒకటి భీష్మ మహారాజు వెనుక కూలర్ ఉండటం కనిపెట్టారు. అంతేకాకుండా కురుక్షేత్ర యుద్దంలో సైనికులు చనిపోయిన సన్నివేశాన్ని చిత్రీకరించవలసి ఉంది. కానీ అందులో ఒక సైనికుడు తలెత్తుకుని చూడటం వంటి సన్నివేశాలు కనిపిస్తాయి. ఆ సమయంలో కెమెరా రోల్ అవుతుందని గమనించిన వ్యక్తి మళ్ళీ చనిపోయినట్లు నటించటం కనిపిస్తుంది. 
mahabharat
 
ఓ యూజర్ ఆ వీడియోని షేర్ చేస్తూ ‘మహాభారత్ కా ముర్దా జివిత్ హో గయా , అభి పూరి నహీ హుయ్ షూటింగ్ (మహాభారతంలో చనిపోయిన వ్యక్తి బ్రతికే ఉన్నాడు, ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు)’ అనే క్యాప్షన్ తో టిక్ టాక్ లో పంచుకుంటాడు. ఇప్పటి వరకు ఈ వీడియోకి 6వేలకు పైగా లైకులు వచ్చాయి. మరోక యూజర్ వారందరూ బ్రతికే ఉన్నారనే విషయం అందరికీ తెలుసు, ఈ విషయాన్ని హాస్యం చేయద్దు అని కామెంట్స్ చేస్తున్నారు.
mahabharats