Today HeadLines : ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్.. హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం

ఫిబ్రవరి 2న ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ఆమె ఈ దీక్షకు కూర్చోనున్నట్లు సమాచారం.

Today HeadLines : ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్.. హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం

12PM

ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్..
హయత్‌నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అయ్యి వాహనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన హయత్ నగర్ పరిధిలోని భాగ్యలత అయాన్ డిజిటల్ సెంటర్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దిల్‌సుఖ్ నగర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందున్న రెండు ఆటోలు, బైకులు, రెండు కార్లను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ఆటోలోని మహిళ తల పగులగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈడీ విచారణ ..
ఈడీ విచారణకు ఇవాళ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ హాజరుకానున్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఝార్ఖండ్ సీఎంను విచారణ చేయనుంది.

నారా భువనేశ్వరి పర్యటన ..
రాష్ట్రంలో రెండోరోజు నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన కొనసాగుతుంది. ఈ యాత్రద్వారా చంద్రబాబు అరెస్టు కు మనస్థాపంతో చనిపోయినవారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది.  దర్శి, కొండపి, కందుకూరులో నారా భువనేశ్వరి పర్యటన ఇవాళ కొనసాగనుంది. రేపు కందుకూరు, ఉదయగిరి, నెల్లూరులో, ఫిబ్రవరి 2న వెంకటగిరి, ఆత్మకూరులో భుశనేశ్వరి పర్యటన కొనసాగనుంది.

పెరిగిన చలి తీవ్రత ..
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. చలిగాలుల ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 21ఏళ్ల రికార్డును చలి బద్దలుకొట్టింది. 2003 తరువాత జనవరిలో అత్యధికంగా చలి నమోదైంది. హర్యానా, పంజాబ్, చండీఘడ్, యూపీలో పలు ప్రాంతాలను పొంగమంచు కమ్మేసింది. 50మీటర్లకు విజిబులిటీ పడిపోయింది. పొగమంచు ప్రభావంతో రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

తిరుమల సమాచారం..
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతుంది. మంగళవారం శ్రీవారిని 61,135 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు.

జవాన్లు మృతి ..
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఇద్దరు జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్ లో రైఫిల్ తో కాల్చుకుని జవాన్ మరణించగా.. మరికొరు బలవన్మరణం చెందారు.

ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 11గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, పలు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఢిల్లీకి జగన్..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. కేబినెట్ మీటింగ్ అనంతరం ఆయన గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్తారు. రేపుకూడా సీఎం ఢిల్లీలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ప్యాకేజీ, కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలను ఆయన కోరనున్నారు. రాజకీయ పరిణామాలపైకూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2న ఢిల్లీలో షర్మిల దీక్ష?
ఫిబ్రవరి 2న ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ఆమె ఈ దీక్షకు కూర్చోనున్నట్లు సమాచారం. ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ముఖ్య నేతలందరూ ఢిల్లీ రావాలని ఆమె పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ యాత్ర ముగిసిన తరువాత 5న మడకశిరలో, ఆ తరువాత గన్నవరం, మైజాగ్ లో బహిరంగ సభలు నిర్వహించాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

బడ్జెట్ సమావేశాలు..
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా.. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదల చేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

ప్రమాణ స్వీకారం..
ఇవాళ ఎమ్మెల్సీలుగా మహేష్ గౌడ్, బల్మూరి వెంకట్ లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.