Top Headlines : కొత్త పార్టీ పెట్టిన లక్ష్మీనారాయణ, 2 నెలల పసికందుకి కరోనా
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కొత్త చీఫ్‌గా సంజయ్ సింగ్ ఎన్నికైయ్యారు. పోటీ చేసిన ఎనిమిది మందిలో సంజయ్ సింగ్‌కు అత్యధిక ఓట్లు రావడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

11PM Head Lines
తెలంగాణలో కరోనా కలకలం
తెలంగాణలో మరో చిన్నారి కరోనా బారిన పడింది. హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో మరో పసికందుకి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. 2 నెలల చిన్నారికి కరోనా సోకింది. కాగా గత 2 రోజుల వ్యవధిలో నిలోఫర్ లో రెండు కేసులు వెలుగుచూడటం కలవర పెడుతోంది. 14 నెలల చిన్నారికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఈ కొత్త పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరు జై భారత్ (N-నేషనల్) పార్టీ అని తెలిపారు. అన్ని వర్గాలను కలిసి, అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ పెట్టానని వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పుట్టిందని స్పష్టం చేశారు లక్ష్మీనారాయన.
6 నెలల పసికందుకి కోవిడ్ పాజిటివ్
తెలంగాణలో 15 నెలల చిన్నారికి వైరస్ సోకడం అందరినీ షాక్ కి గురి చేసింది. తాజాగా వెస్ట్ బెంగాల్ లో 6 నెలల పసికందుకు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. కోల్ కతా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో పసికందు బాధపడుతోందని డాక్టర్లు తెలిపారు.
పద్మశ్రీని వెనక్కి ఇచ్చేసిన బజ్‌రంగ్ పునియా
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కొత్త చీఫ్‌గా సంజయ్ సింగ్ ఎన్నికైయ్యారు. పోటీ చేసిన ఎనిమిది మందిలో సంజయ్ సింగ్‌కు అత్యధిక ఓట్లు రావడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఈ ఫలితాలపై పలువురు రెజర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు వీడ్కొలు పలుకుతున్నట్లు ప్రకటించగా తాజాగా మరో స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇస్తున్నట్లు తెలియజేశాడు.
శరద్ పవార్‌ను కలిసిన రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. న్యూఢిల్లీలోని అశోకా హోటల్‌లో మంగళవారం విపక్ష ఇండియా కూటమి నాల్గవ సమావేశం జరిగిన సమయంలో ఇద్దరు నేతల సమావేశం జరిగింది.
ఎన్టీఆర్ టెక్కలి వెళ్ళలేదా?
టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి పేర్నినాని. వైసీపీలో ఎమ్మెల్యే స్థానాల మార్పుపై చంద్రబాబు చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు పేర్నినాని. రాజకీయాల్లో అభ్యర్థుల మార్పు కామన్ అన్నారాయన. మోదీ గుజరాత్ నుండి వారణాసి వెళ్ళలేదా? చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పంకు మారలేదా? లోకేశ్ మంగళగిరి వెళ్లలేదా? పవన్ గాజువాక వెళ్లలేదా? ఎన్టీఆర్ టెక్కలి వెళ్ళలేదా? హిందూపురం బాలకృష్ణ సొంతూరా? వీళ్ళంతా ఎందుకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు? అని చంద్రబాబును నిలదీశారు పేర్నినాని.
మహారాష్ట్ర సీఎంతో రామ్ చరణ్ దంపతులు
ఇటీవల రామ్ చరణ్ దంపతులు ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చరణ్ దంపతులు ముంబైలోనే ఉన్నారు. తమ పాప క్లిన్ కారాతో కలిసి ఇటీవల ముంబైలో ఓ ఆలయానికి వెళ్లిన వీడియోలు బయటకి వచ్చి వైరల్ కూడా అయ్యాయి. తాజాగా రామ్ చరణ్ ఓ స్పెషల్ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఎలక్షన్ ఫోకస్..
2024 సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈరోజు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, అమిత్ షా హాజరుకానున్నారు. అలాగే బీజేపీ జాతీయ పదాధికారులు, రాష్ట్రాల అధ్యక్షులు హాజరుకానున్నారు. బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టనుంది. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది.
శ్వేతపత్రాలకు పవర్ పాయింట్ తో కౌంటర్
కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దీని కోసం రేపు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధిని ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో వివరించనున్నారు కేటీఆర్.
పోలీసులు డిస్కౌంట్ ఆఫర్..
పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులకు మరోసారి డిస్కౌంట్ ఇవ్వనున్నారు పోలీసులు. డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లు డిస్కౌంట్ తో కట్టే అవకాశాన్ని కల్పించనున్నారు. ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్.. అలాగే
టూవీలర్ చలాన్లకు 80 శాతం,
ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం,
లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్ కి 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు.
పోలీసులపై పెప్పర్ స్ప్రే..
హైదరాబాద్ పరిధిలోని జిల్ పల్లిలో ఎక్సైజ్ పోలీసులపై దోపిడీ గ్యాంగ్ దాడికి పాల్పడింది. పోలీసులపై పెప్పర్ స్ప్రే కొట్టి దోపిడీ గ్యాంగ్ పరారైంది. బైక్, నకిలీ తుపాకి, రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కంట్రోల్ చేయాలి..
డ్రగ్స్ నియంత్రణపై డీజీపీ రవిగుప్తా సమీక్ష నిర్వహించారు. న్యూ ఇయర్ సందర్భంగా నార్కొటిక్ బ్యూరో అధికారులు, ఉన్నతాధికారులతో చర్చించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిసనలు చేపట్టింది. ఇండియా కూటమిలోని పలువురు నేతలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. సేవ్ డెమెక్రసి పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు నేతలు వేదిక వద్దకు చేరుకున్నారు.
ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన
కేంద్ర ఎన్నికల బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు సమావేశం కానున్నారు. ఎన్నికల సన్నద్ధత,ఓటర్ల జాబితా వంటి అంశాలపై చర్చించనున్నారు. ఓటర్ల లిస్టులో అవకతవకలు జరుగుతున్నాయంటూ టీడీపీ, వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయటంతో..18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈసీ అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. అలాగే రేపు మరో 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు నివేదిక ఇవ్వనున్నారు.
ఇండియా కూటమి నిరసనలు
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా ఇండియా కూటిమి నిరసనల్లో భాగంగా..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
కొత్త రాజకీయ పార్టీ
తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ.. సినీ దర్శక నిర్మాత సత్యారెడ్డి తెలుగు సేన అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. లయ్యప్ప్ దీక్ష, ప్రశ్నిస్తా, సర్దార్ చిన్నపరెడ్డి సహా 53 సినిమాలు తీసినసత్యారెడ్డి కొత్తగా మరో రాజకీయ పార్టీని స్థాపించారు.
చిన్నారికి కరోనా..
హైదరాబాద్ లో 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారికి కరోనా సోకినట్లు నిలోఫర్ వైద్యులు నిర్ధారించారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ జ్వరం, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలతో ఆస్పత్రులకు జనాలు క్యూ కడుతున్నారు.
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ ఎర్రమంజిల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ భవనంలోని నాలుగో ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తోంది.
హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురురెదురుగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనం టోకెన్ల కోసం కేంద్రాల్లో భక్తులు భారీ క్యూలైన్లు కట్టారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో తిరుమల రద్దీగా మారింది.
నేడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన
పార్లమెంట్‌లో ప్రతిపక్షనేతల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ పోరుబాటు పట్టింది. నేడు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా సలార్ విడుదల
ప్రపంచ వ్యాప్తంగా సలార్ మూవీ విడుదల అయింది. తెలుగు రాష్ట్రాల్లో సలార్ గ్రాండ్ రిలీజ్ చేశారు. తెలంగాణలో అర్ధరాత్రి బెనిఫిట్ షోతో సలార్ రిలీజ్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో సలార్ మేనియా ఊపేస్తోంది. థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ కోలాహలం చేస్తున్నారు. టపాసులు పేల్చుతూ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
మూడు కొత్త క్రిమినల్ చట్టాలకు సవరణలు
మూడు కొత్త క్రిమినల్ చట్టాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టం అమలు కానుంది.
భారత్ సిరీస్ మనదే!
భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. సఫారీల గడ్డపై సిరీస్ దక్కించుకుంది.