Barse Deva: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన అగ్రనేత.. హిడ్మా తర్వాత ఇతడే

మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను దేవానే చూసేవాడని, ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించినట్లు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. Barse Deva

Barse Deva: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన అగ్రనేత.. హిడ్మా తర్వాత ఇతడే

Barse Deva Representative Image (Image Credit To Original Source)

Updated On : January 3, 2026 / 6:28 PM IST

 

  • మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా సరెండర్
  • తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 20 మంది మావోయిస్టులు
  • మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా ఉన్న దేవా
  • హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో దేవాదే కీలక పాత్ర

 

Barse Deva: మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత, పీఎల్ జీఏ చీఫ్ బర్సె దేవా అలియాస్ సుక్కుతో పాటుగా మరో కీలక నేత కంకనాల రాజిరెడ్డి తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. వారితో పాటు మరో 18 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా ఉన్న దేవా.. హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు తెలిపారు.

ఆయుధాల సరఫరాలో కీలక పాత్ర..

మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను దేవానే చూసేవాడని, ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించినట్లు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. హిడ్మా, బర్సే దేవా ఛత్తీస్ గఢ్ లోని ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం 48 వెపన్స్ తో పాటుగా పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. అలాగే వారి నుంచి 20 లక్షల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టు పార్టీ పెద్ద ఎదురుదెబ్బ.. పతనమైపోయిన PLGA

”బర్సె దేవా పీఎల్ జీఏ బెటాలియన్ కమాండర్. దేవాతో పాటు 17 మంది మావోయిస్టులు, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, అతడి భార్య తెలంగాణ ప్రభుత్వం ముందు సరెండర్ అయ్యారు. బర్సె దేవా అలియాస్ సుక్క అలియాస్ దర్శన్ ది సుక్మా జిల్లా. హిడ్మా స్వగ్రామం కూడా ఇదే. 22ఏళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరారు. బెటాలియన్ కమాండర్ గా ఎదిగారు. శక్తియుక్తులు ఉన్న క్యాడర్ ను సంపాదించాడు.

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఎన్ఐఏకు సంబంధించి దేవాపై 70 లక్షల రూపాయల రివార్డ్స్ ఉన్నాయి. అధునాతమైన ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇందులో 2 ఎల్ఎంజీలు ఉన్నాయి. 10 మ్యాగజీన్లు, 22 ఆయుధాలు ఉన్నాయి. అమెరికాలో తయారైన రైఫిల్ కూడా ఉంది. సీపీఐ మావోయిస్టు పార్టీకి ఇది పెద్ద దెబ్బ. పీఎల్ జీఏ బెటాలియన్ కొలాప్స్ అయిపోయింది” అని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.

Also Read: మావోయిస్టులకు భారీ దెబ్బ.. 14మంది మృతి.. కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతం?