Encounter : మావోయిస్టులకు భారీ దెబ్బ.. 14మంది మృతి.. కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతం?

Encounter :ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా అడవుల్లో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది.

Encounter : మావోయిస్టులకు భారీ దెబ్బ.. 14మంది మృతి.. కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతం?

encounter

Updated On : January 3, 2026 / 12:10 PM IST
  • సుక్మా జిల్లా కిస్తారామ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్
  • భద్రతాబలగాల కాల్పుల్లో 12మందికిపైగా మావోయిస్టులు మృతి
  • బీజాపూర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Encounter : మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. శనివారం సుక్మా జిల్లా పరిధిలోని కొంటా డివిజన్ కిస్తారామ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. భద్రతాబలగాల ఎదురు కాల్పుల్లో 12 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందారు.

మృతులంతా కొంటా ఏరియా కమిటీ సభ్యులుగా నిర్ధారణ అయింది. ఈ ఘటనతో కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతమైనట్లు సమాచారం. ఘటన స్థలి నుంచి AK-47లు, INSAS , SLR రైఫిల్స్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నారు. కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడుతోపాటు కమిటీ సభ్యుడు సచిన్ ముగ్దూ ఉన్నాడు. కొంటా డివిజన్ కిస్తారామ్ అడవుల్లో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహించాయి. శనివారం ఉదయం 8గంటల సమయంలో మావోయిలు ఎదురు కాల్పులకు దిగడంతో.. భద్రత బలగాలు ప్రతికాల్పులు జరిపాయి. కొద్దిసేపు ఇరువర్గాల మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 12మందికిపైగా మావోయిస్టులు మరణించారు.

మరోవైపు.. బీజూపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం 5:00 గంటల నుండి డీఆర్జీ, మావోయిస్టుల మధ్య అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.