Jana Nayagan trailer: విజయ్ చివరి సినిమా ‘జన నాయకుడు’ ట్రైలర్‌ రిలీజ్.. ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడంటే..

ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది.

Jana Nayagan trailer: విజయ్ చివరి సినిమా ‘జన నాయకుడు’ ట్రైలర్‌ రిలీజ్.. ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడంటే..

Vijay (Image Credit To Original Source)

Updated On : January 3, 2026 / 8:48 PM IST
  • బాలకృష్ణ “భగవంత్‌ కేసరి”కి మార్పులు చేసి “జన నాయకుడు”
  • ట్రైలర్‌ చూస్తే అర్థమైపోతున్న సినిమా పూర్తి స్టోరీ
  • మమితబైజును ఆర్మీలో చేర్చడమే హీరో లక్ష్యం 

Jana Nayagan trailer: విజయ్‌ హీరోగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో వస్తున్న ‘జన నాయగన్‌’ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను ‘జన నాయకుడు’ పేరుతో రిలీజ్ చేయనున్నారు. యాక్షన్‌, ఎమోషన్, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు.

సౌతిండియా ప్రేక్షకులు ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. ఈ సినిమాతో తన నటనా ప్రస్థానానికి విజయ్ ముగింపు పలుకుతున్నారు. తన రాజకీయ ప్రయాణంపై దృష్టి పెట్టేందుకు, ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం కార్యకలాపాలను చూసుకునేందుకు విజయ్ తన సమయాన్ని కేటాయించనున్నారు.

Also Read: Akhnda 2 OTT: ఓటీటీలోకి వస్తున్న అఖండ 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘జన నాయకుడు’ సినిమాలో విజయ్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. తాను సాధారణ వ్యక్తినని అంటున్నారు. ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. మమితబైజు, బాబీ దేఓల్‌, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరైన్, తదితరులు నటించారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించగా, పాటల సాహిత్యాన్ని అరివు రచించారు.

తెలుగులో బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి రూపొందించిన భగవంత్‌ కేసరి మూవీకి మార్పులు చేసి ‘జన నాయకుడు’ సినిమా తీసినట్లు ఈ ట్రైలర్‌ చూస్తే అర్థమైపోతుంది. భగవంత్‌ కేసరిలో శ్రీలీలను ఆర్మీలో చేర్చడమే లక్ష్యంగా బాలకృష్ణ పాత్ర ఉంటుంది. ‘జన నాయకుడు’ సినిమాలోనూ మమితబైజును ఆర్మీలో చేర్చడమే లక్ష్యంగా విజయ్‌ శిక్షణ ఇస్తున్నారు.