Shilpa Shetty: భర్తపై కేసు పట్టించుకునేంత తీరిక లేదంటోన్న శిల్పా శెట్టి
భర్త రాజ్ కుంద్రాపై నమోదైన కేసుల గురించి పట్టించుకునేంత తీరక లేదంటున్నారు శిల్పా శెట్టి. మొబైల్ యాప్స్ లో పోర్న్ వీడియోలు...

Shipa Setty Raj Kundra
Shilpa Shetty: భర్త రాజ్ కుంద్రాపై నమోదైన కేసుల గురించి పట్టించుకునేంత తీరక లేదంటున్నారు శిల్పా శెట్టి. మొబైల్ యాప్స్ లో పోర్న్ వీడియోలు ప్రసారం చేసే వ్యాపారం చేస్తున్నాడంటూ రాజ్ కుంద్రాపై కొద్ది వారాల క్రితం కేసు నమోదైంది.
‘నా పనిలో బిజీగా ఉన్నా. రాజ్‌కుంద్రా గురించి ఇప్పటి వరకూ ఏమైందో నాకు తెలీదు’ అని స్టేట్మెంట్ ఇచ్చారు శిల్పా. ముంబై పోలీసులు 1400పేజీల ఛార్జ్ షీట్ లో ఈ విధంగా పేర్కొన్నారు. పోర్న్ రాకెట్ తో లింక్ అయి ఉన్న హాట్‌షాట్స్, బాలీఫేమ్ కాంట్రవర్షియల్ యాప్‌ల గురించి కూడా తనకేం తెలీదని చెప్పుకొచ్చింది.
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో పోర్న్ కంటెంట్ ఉందనే ఆరోపణలు వచ్చిన తర్వాత హాట్ షాట్స్ యాప్ ను తొలగించారు. ఇప్పుడు బాలీఫేమ్ పేరుతో మరో యాప్ లాంచ్ అయింది. రాజ్ కుంద్రా వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిధిలో పోర్న్ రాకెట్ కు సంబంధించిన కార్యకలాపాలు జరిపేవాడని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
Priya Prakash Varrier : ప్రియ పాటకు ఫ్రెండ్స్ కోరస్..
జులై 19న మరికొందరితో కలిసి రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. నలుగురు ఉద్యోగులు ఈ ఆరోపణలకు సాక్ష్యులుగా మారారు. కోర్టులో ఈ కంటెంట్ అంతా ప్రేరణ కలిగించేదే కానీ, ప్రోర్నగ్రఫిక్ కాదని రాజ్ కుంద్రా వాదించాడు. నెట్ ఫ్లిక్స్ లోనూ ఇలాంటి కంటెంట్ ఉందని చెబుతున్నారు.