వాటే ఐడియా సర్ జీ : చేయి చాపండి..గుళ్లో..తీర్థం పోస్తున్న మెషిన్

  • Published By: madhu ,Published On : June 22, 2020 / 03:17 AM IST
వాటే ఐడియా సర్ జీ : చేయి చాపండి..గుళ్లో..తీర్థం పోస్తున్న మెషిన్

కరోనా వేళ కొత్త కొత్త ఐడియాలు వచ్చేస్తున్నాయి. ఈ మహమ్మారి నుంచి కాపాడుకొనేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు కొంతమంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుండడమే ఇందుకు కారణం. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశాన్ని కూడా కమ్మేసింది. దీంతో లాక్ డౌన్ విధించింది కేంద్రం. ప్రస్తుతం లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో అప్పటి దాక క్లోజ్ అయిన..ఓపెన్ అయ్యాయి.

కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. వందల సంఖ్యలో కేసులు నమోదువుతూనే ఉన్నాయి. ఓపెన్ అయిన దానిలో టెంపుల్స్ కూడా ఉన్నాయి. అయితే..కొన్ని నిబంధనలతో ఆలయాలు ఓపెన్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తీర్థం, ప్రసాదాలు పెట్టవద్దనే కండీషన్స్ పెట్టారు. అలాగే గుళ్లో గంట కూడా కొట్టకుండా చూడాలని సూచించారు.

దీంతో కొంతమంది తమ బుర్రకు పదును పెట్టారు. టెక్నాలజీ సహాయంతో మెషిన్లు తయారు చేస్తున్నారు. గంట కొట్టేందుకు సెన్సార్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. భక్తులు గంట దగ్గరకు వెళ్లగానే..ఆటోమెటిక్ గా గంట కొట్టేస్తుంటుంది. తాజాగా..తీర్థం పంచే యంత్రాన్ని కూడా తయారు చేశారు. అసిస్టెంట్ ప్రోఫెసర్ సంతోష్ దీనిని కనిపెట్టారు.  

కర్నాటక, మంగళూరు ఆలయాల్లో ఇది కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.  దీనిని తీర్థ డిస్పెన్సర్ అని పిలుస్తున్నారు. సెన్సార్ టెక్నాలజీతో పనిచేస్తోంది. ఆలయంలోకి వచ్చిన తర్వాత..స్వామిని దర్శించుకోవడం, ప్రదిక్షణాలు చేయడం, పూజలు చేయడం..అన్నీ అయిపోయిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన మెషిన్ దగ్గరకు వెళ్లాలి.

యంత్రం దగ్గర చేయి పెట్టాలి అంతే. ఆటోమెటిక్ గా సెన్సార్లు గుర్తించి..కొద్దిగా తీర్థం పోస్తుంది. ఇంకేముంది..తాగేయడమే. తీర్థం మాత్రం అందరికీ సమానంగా పోస్తుంది. ప్రస్తుం ఈ మెషిన్ పై ఆలయ నిర్వాహకులు, పూజారులు ఆసక్తి కనబరుస్తున్నారంట. ఈ మెషిన్ ను తయారు చేయడానికి రూ. 2 వేల 700 ఖర్చయిందని అసిస్టెంట్ ప్రోఫెసర్ సంతోష్ తెలిపారు. 

Read:  అరచేతిలో నీళ్లు తాగుతున్న ఆకుపచ్చ పాము..వైరల్ వీడియో