ఒకే ప్రయాణికుడితో చెన్నైకి స్పెషల్ ఫ్లయిట్..!

ఒక ప్రయాణికుడితో విమానం కదిలింది. కోల్ కత్తా నుంచి ఒకే ప్రయాణికుడితో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం చెన్నైకు చేరుకుంది. సింగపూర్‌లో చిక్కుకున్న 145 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లయిట్ కోల్‌కతా మీదుగా చెన్నైకు చేరుకుంది. విమాన ప్రయాణికులను స్వాగతించేందుకు ప్రభుత్వ అధికారులు, వైద్య బందం, ఇమిగ్రేషన్, కస్టమ్స్ శాఖ అధికారులు అంతా సిద్ధంగా ఉన్నారు. కానీ, విమానంలో నుంచి వారు ఊహించినట్టుగా ప్రయాణికులు ఇతర ప్రయాణికులు ఎవరూ లేరు..
ఒక ప్రయాణికుడు మాత్రమే ఉన్నాడు. మెల్లగా కిందికి దిగొచ్చాడు. మిగతా వారంతా ఏరని అక్కడి అధికారులు విచారించగా… సింగపూర్ నుంచి 145 మంది వచ్చినట్టు చెప్పాడు. కోల్ కతాలో 144 మంది దిగి వెళ్లారని తెలిపాడు. తాను మాత్రం చెన్నైకి వచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అధికారులంతా అతడికి వెల్ కమ్ చెప్పారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు.. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూచించారు.
కొద్ది రోజుల క్రితం అతడి భార్య గుండెపోటుతో కన్నుమూసింది. 35 ఏళ్ల వాసుకి మరణించిన సమయంలో అతడు స్వదేశానికి రాలేకపోయాడు. కొన్నిరోజుల తర్వాత ఇప్పుడు ఇంటికి తిరిగి ఒంటరిగా ప్రయాణించాడు. కానీ తల్లిని పోగొట్టుకున్న తన ముగ్గురు పిల్లల కోసం వచ్చినట్టు చెప్పాడు.
మొత్తం విమానంలో ఇది తన ఏకైక ఆలోచనగా కూతన్ అన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా సింగపూర్‌లో మేసన్‌గా పనిచేస్తున్నాడు. తాను తన భార్యకు అంత్యక్రియలకు హాజరు కాలేదు. కానీ ఆ తరువాత, అక్కడ ఉన్న తన స్నేహితులు కొందరు సాయం చేయడంతో తాను టికెట్ కొని తిరిగి ఇంటికి వచ్చినట్టు వాపోయాడు.