Bus Accident: 60 మంది ప్రయాణికులతో.. టిప్పర్ ను ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్..
మొత్తం 60 మంది వలస కూలీలతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు కాగా డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. అదృష్టం కొద్దీ బస్సులో ప్రయాణిస్తున్న అరవై మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Travels Bus With 60 Passengers Hit By Tipper
Bus Accident: మొత్తం 60 మంది వలస కూలీలతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు కాగా డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. అదృష్టం కొద్దీ బస్సులో ప్రయాణిస్తున్న అరవై మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఏలూరు కాల్వ వంతెన జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ట్రావెల్ బస్సులో 60 మంది వలస కూలీలు ఉపాధి నిమిత్తం తమిళనాడు నుంచి తిరుపూర్ వెళ్తుండగా బస్సు కేసరపల్లి వద్దకు చేరుకోగానే ఈ ప్రమాదం జరిగింది.
అప్పటి వరకు వేగంగా వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయటంతో వెనుక నుంచి వస్తున్న తమిళనాడు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు వెనక నుండి బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయింది. ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలవగా.. బస్సు డ్రైవర్ మాత్రం క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బస్సు డ్రైవర్ ను క్యాబిన్ నుంచి బయటకుతీసి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.