క్యాన్సర్ చికిత్సకు హెల్ప్ చేయమంటూ రిక్వెస్ట్..లక్షలు సేకరించి జల్సాలు : జనాల ఎమోషన్ వాడేసుకున్న కిలాడీ

Woman Fake Crowd Funding : కష్టపడకుండా డబ్బులు రావాలి. వాటితో జల్సాలు చేయాలి? ఎలా? అని ఆలోంచిన ఓ బ్రిటన్ మహిళకు ఓ ఐడియా వచ్చింది. దానికి క్యాన్సర్ అదే రోగాన్ని వాడుకుంది. నేనే పేదదాన్ని..క్యాన్సర్ రోగం వచ్చింది..దయచేసి సహాయం చేయండీ..అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.అది చూసిన చాలామంది జాలిపడ్డారు. డబ్బు సహాయం చయటానికి ముందుకొచ్చారు. అలా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తోంది. ఈ విషయంకాస్తా బట్టబయలు కావటంతో మొదటికే మోసం వచ్చింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కేసు బుక్ చేసి కోర్టుకు పంపించటంతో కోర్టు ఆమెకు జైలు శిక్ష వేసింది.
సోషల్ మీడియాలో రిక్వెస్టులు..భారీగా విరాళాలు..
బ్రిటన్ కు చెందిన 42 ఏళ్ల నికోల్ ఎల్కబ్బాస్ అనే మహిళ నకిలీ ఫండింగ్ తో పట్టుబడింది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఫండ్ రైజింగ్ పద్ధతిని వాడుకుంది. క్యాన్సర్ చికిత్స కోసమంటూ సహాయం చేయాలని సోషల్ మీడియాలో రిక్వెస్ చేస్తూ పోస్ట్ పెట్టింది. దాని కోసం తాను హాస్పిటల్ లో ఎడ్మిట్ అయి..చికిత్స పొందుతున్నట్లుగా..కీమో థెరపీ చేయించుకుంటున్నట్లుగా సెటప్ క్రియేట్ చేసి పోస్ట్ చేసింది.
తనకు అండాశయ క్యాన్సర్ ఉందని..చికిత్సకు చాలా ఖర్చవుతుందని కానీ తనవద్ద అంత డబ్బు లేదనీ..కానీ నాకు బతకాలని చాలా ఆశగా ఉందని ఎంతో బాధలో ఉన్నట్లుగా పోస్టులు పెట్టింది. GoFundMeలో క్రౌడ్ ఫండింగ్ ప్రచారం చేసింది. తెలిసినవారు, బంధుమిత్రుల నుంచి 42,000 పౌండ్లు సేకరించింది. ఈ డబ్బును జల్సాల కోసం ఖర్చు చేసింది. ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి ఆమె 3,592 పౌండ్లు విలువైన లగ్జరీ బాక్స్ కొనుగోలు చేసిందట.
ఈ విషయం బైటపడటంతో ఇటువంటి మోసాలకు పాల్పడిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. సహాయం చేయాలనుకునే పెద్ద మనస్సు కలిగినవారిని మోసం చేసి డబ్బులు సేకరించిందని కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టగా ధర్మాసనం నికోల్ ఎల్కబ్బాస్ కు 2 సంవత్సరాల 9 నెలల జైలు శిక్ష విధించింది.
అలా 2018 ఫిబ్రవరి నుంచి గత ఆగస్టు వరకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బు సేకరించింది. ప్రజల నుంచి పొందిన డబ్బును విలాసాలకు, గ్యాంబ్లింగ్‌కు ఖర్చు చేయడం ద్వారా ఎల్కబ్బాస్ కొత్తరకం మోసానికి తెరతీసినట్లు జడ్జి మార్క్ వీకెస్ తెలిపారు. ప్రజల సొమ్ముతో ఇటలీ, స్పెయిన్‌లో షాపింగ్ చేసిందని, విలాసాలతో ఎంజాయ్ చేసిందని అన్నారు. ఇటువంటి చర్యలు మంచి చేయాలనుకునే పెద్ద మనస్సు కలిగినవారి ఆలోచనలపై వ్యతిరేక ప్రభావం చూపుతాయన్నారు.
అంతా పక్కా ప్లాన్ ప్రకారంగా..
ఎల్కబ్బాస్ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ కోసం GoFundMeలో ప్రత్యేకంగా ఒక పేజీని క్రియేట్ చేసింది. దాన్ని తన తల్లి ఏర్పాటు చేసిందని చెప్పింది. ఒవేరియన్ క్యాన్సర్ కోసం మూడు ఆపరేషన్లు, ఆరు రౌండ్ల కీమోథెరపీ చేయించుకున్నట్లు, దీంతో ఆర్థిక సమస్యలు ఎదురైనట్టు వెబ్‌సైట్ పేజీలో రాసుకొచ్చింది. హాస్పిటల్‌లో ట్రీట్ మెంట్ చేయించుకున్నట్లుగా ఫోటోలను కూడా క్రియేట్ చేసి వాటిని అప్‌లోడ్ చేసింది.
స్పెయిన్ నుంచి తెప్పించాల్సిన మెడిసిన్ కోసం డబ్బు చెల్లించలేకపోతున్నామని చెప్పుకొచ్చింది. దాని కోసం ఫండ్ రైజింగ్ మార్గమని..వెబ్‌సైట్లో తన కొడుకు ఫోటోలు కూడా పెట్టి ప్రజలను ఎమోషనల్‌గా ఫీలయ్యేలా చేసింది. ఇవన్నీ నిజమేనని భావించిన ప్రజలు GoFundMe డొనేషన్స్ ద్వారా డబ్బు చెల్లించారు. మరికొంతమంది నేరుగా ఆమె బ్యాంకు అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశారు. క్యాన్సర్ పేరుతో ఇంత మోసానికి పాల్పడిన ఆమె గురించి తెలిసివారు..హెల్ప్ చేసినవారంతా షాక్ అవుతున్నారు.