టాయ్‌లెట్ పోస్తున్న పిల్లాడ్ని సిగిరెట్లతో కాల్చి..మెడకు ప్లాస్టర్ చుట్టి..బాత్ టప్ లో పడేసి చంపేసింది

US : pennsylvania : యూఎస్ లోని పెన్సిల్వేనియా 9 ఏళ్ల పసివాడిని అతి చిన్న కారణానికే ప్రాణాలు తీసిన ఘటన కన్నీరు పెట్టింది. చిన్న పిల్లలు టాయ్‌లెట్ పోయటం సర్వసాధారణమైనదే. కానీ తరచూ టాయ్‌లెట్ పోస్తున్నడని తొమ్మిది సంవత్సరాల పిల్లాడిని అత్యంత కిరాతకంగా చంపేసిందో మేనత్త. చిన్నపిల్లాడిని కూడా చూడకుండా సిగిరెట్లతో కాల్చి..మెడకు ప్లాస్టిక్ కవర్ చుట్టేసి అత్యంత కిరాతంగా బాత్ టబ్ లో పడేసి చంపేసింది.
వివరాల్లోకి వెళితే..పెన్సిల్వేనియాలోని లాక్ హెవెన్‌కు చెందిన జేమీ లైన్ జాక్సన్ అనే 36 ఏళ్ల మహిళకు 12 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలున్నారు. వారితో పాటు తన సోదరుడి 9 ఏళ్ల కొడుకు (మేనల్లుడు) కూడా ఉన్నాడు. ఆ పిల్లాడి పేరు అన్సన్ లాండన్ మిచెల్ స్టోవర్. జేమీ జాక్సన్ పిల్లలతో కలిసి మించెల్ ఆడుకుంటుంటాడు.
రోజులాగనే ఆంటో పిల్లలతో కలిసి మిచెల్ ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటూన్న మిచెట్ ఎక్కడ పడితే అక్కడ టాయ్‌లెట్ పోస్తున్నాడు. అది చూసిన ఆంటో జేమీ లైన్ జాక్సన్ కు కోపం వచ్చేసింది. దబదబా మిచెల్ ను బాదింది. కానీ మళ్లీ మళ్లీ మిచెల్ టాయ్‌లెట్ పోయటంతో ఆమె కోపం పట్టలేకుపోయింది. ఆగ్రహం తన్నుకొచ్చింది.
దీన్ని మిచెల్ ను రెక్క పట్టుకుని బరబరా గదిలోకి లాక్కెళ్లి పోయిన చిత్ర హింసలు పెట్టింది. పిల్లాడి ఒంటినిండా సిగరెట్లతో కాల్చింది. ఆ పిల్లాడి ప్రైవేట్ భాగాలను కూడా సిగిరెట్లతో కాల్చింది. దాంతో పాపం ఆ పిల్లాడు గిలగిలా కొట్టుకున్నాడు. వదిలేయమని వేడుకున్నాడు. కానీ ఆ కఠినాత్మురాలి గుండె కరగలేదు. కనీసం ఒక మనిషిగా కూడా ఆలోచించలేదు. అక్కడితో ఆమె కోపం తగ్గలేదు. మిచెల్ మెడకు టైట్ గా ప్లాస్టర్ చుట్టేసింది. దీంతో ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటున్న మిచెల్ ను కళ్లు పెద్దవి చేస్తూ చూసింది. నోరెత్తావంటే చంపేస్తాను జాగ్రత్త అంటూ అరిచింది.
అక్కడితో ఆమె కిరాతం ఆగలేదు. ఓ బట్టలో పిల్లాడ్ని చుట్టసి బాత్‌టబ్‌లో పడేసింది.అది లోతుగా ఉండటం..పైగా ఒంటినిండా బట్టలు చెట్టేయటంతో ఆ టబ్ లోంచి మిచెల్ బైటకు రాలేకపోయాడు. పైగా మెడకు ప్లాస్టర్ చుట్టేసి ఉండటంతో ఊరిపి ఆడక గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు ఆ తొమ్మిదేళ్ల పిల్లాడు.
టబ్ లో గిలగిలా కొట్టుకుంటున్న మేనల్లుడికి చూసినా ఆమెలో కోపం తగ్గలేదు. మనసు చలించలేదు. అలా ఆడుకునే పిల్లాడిని చిత్ర హింసలు పెట్టి అలాగే 24 గంటల నుంచి 48 గంటల వరకు అతడి బాత్‌టబ్‌లోనే వదిలేసింది. మరోవైపు తను చేసిన నేరం బయటపడకుండా అతడి గదినంతా శుభ్రం చేసింది. ఇది చూసిన ఆమె బంధువు అనుమానం వచ్చిపోలీసులకు సమాచారం అందించాడు.
కానీ పోలీసులు ఆ ఇంటికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసివాడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. అతడి చావుకు కారణమైన జాక్సన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత బుధవారం (డిసెంబర్ 2,2020) ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా హత్యానేరంతో పాటు, మరణాన్ని దాచడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, చిత్రహింసలు పెట్టడం వంటి అభియోగాల కింద ఆమెకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.
స్టోవర్ శవపరీక్ష రిపోర్టులోనూ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అతడి తల, కళ్లు, మెడ, చేతులు, కాళ్లు తీవ్ర గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. మెదడులో రక్తస్రావం జరిగిందని తేలింది. ప్రైవేటు పార్ట్స్‌పై సిగరెట్‌తో కాల్చిన గుర్తులు కూడా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది.