Vakeel Saab: పవర్ స్టార్ ‘టైటిల్ కార్డ్’ను వైరల్ చేస్తున్న ఫ్యాన్స్!

మూడేళ్ళ గ్యాప్ తర్వాత కూడా పవర్ స్టార్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా వకీల్ సాబ్. ఒకవైపు కరోనా భయపెడుతున్నా అభిమానులకు అదేమీ పట్టలేదు. అసలే సక్సెస్ స్టోరీ కావడం.. దానికి పవన్ కళ్యాణ్ మానియా తోడై ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

Vakeel Saab: పవర్ స్టార్ ‘టైటిల్ కార్డ్’ను వైరల్ చేస్తున్న ఫ్యాన్స్!

Vakeel Saab Fans Viralizing Power Star Title Card

Updated On : April 30, 2021 / 7:06 PM IST

Vakeel Saab: మూడేళ్ళ గ్యాప్ తర్వాత కూడా పవర్ స్టార్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా వకీల్ సాబ్. ఒకవైపు కరోనా భయపెడుతున్నా అభిమానులకు అదేమీ పట్టలేదు. అసలే సక్సెస్ స్టోరీ కావడం.. దానికి పవన్ కళ్యాణ్ మానియా తోడై ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. భారీ స్థాయి కలెక్షన్లను రాబట్టుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోర్టు సీన్ రిపీటెడ్ ఆడియన్స్ ను రాబట్టుకుందని ట్రేడ్ పండితులు చెప్పుకొచ్చారు. అయితే.. ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా మారింది. కరోనా దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది.

దీంతో ప్రజలు థియేటర్లో సినిమా పరిస్థితి లేకుండాపోయింది. అందుకే నిర్మాతలు శుక్రవారమే ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తెచ్చేశారు. అర్ధరాత్రి నుండే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను అభిమానులు మరోసారి ఇంకో రౌండ్ వేస్తున్నారు. పనిలో పనిగా ఇప్పుడు ఈ సినిమా మొదట్లో పవన్ ఎంట్రీలో పేరుతో వచ్చే టైటిల్ కార్డును వైరల్ చేస్తున్నారు. ఈ టైటిల్ కార్డు కాస్త కొత్తగా ఉంటుంది. సృష్టిలోని 5 పంచభూతాలతో కలిపి ఒక స్టార్ లా వచ్చి అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు తెరపై పడుతుంది.

ఈ టైటిల్ కార్డు తెగ నచ్చిన అభిమానులు వెండితెర మీద పెద్దగా నోటీస్ చేయకపోగా ఇప్పుడు ఓటీటీలో ప్రసారమయ్యే సినిమా టైటిల్ కార్డును తెగ వైరల్ చేస్తున్నారు. నిజానికి మన స్టార్ హీరోల సినిమాలలో ఈ టైటిల్ కార్డును ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. సినిమాకో విధంగా దర్శకులే దగ్గరుండి ఈ డిజైన్స్ చేస్తుంటారు. వకీల్ సాబ్ కోసం కూడా దర్శకుడు వేణు శ్రీరామ్ వైవిధ్యంగా పంచభూతాల కాన్సప్ట్ తీసుకోగా అది అభిమానులను ఇప్పుడు తెగ నచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు డీపీలు పెడుతూ తెగ వైరల్ చేస్తున్నారు.

Read: Shankar Indian-2 Film: సఫలం కాని చర్చలు.. వివాదం మళ్ళీ మొదటికే!