Vakeel Saab: మరో నెల రోజులు థియేటర్లో ఏకైక పెద్ద సినిమా వకీల్ సాబ్!

సినిమాలో ఎంత విషయం ఉన్నా.. పబ్లిసిటీ కూడా ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారిపోయింది. ఇక సరైన సమయంలో రిలీజ్ చేయడం కూడా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు పెద్ద సవాల్. అందుకే దాదాపుగా వారాంతం, వరసగా హాలిడేస్ ఉండేలా స్టార్ హీరోల సినిమాలను అనౌన్స్ చేస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాను కూడా వరస సెలవుల టైం చూసే విడుదల చేశారు.

Vakeel Saab: మరో నెల రోజులు థియేటర్లో ఏకైక పెద్ద సినిమా వకీల్ సాబ్!

Pawan Kalyan

Updated On : April 15, 2021 / 12:12 PM IST

Vakeel Saab: సినిమాలో ఎంత విషయం ఉన్నా.. పబ్లిసిటీ కూడా ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారిపోయింది. అందుకే స్టార్ హీరోలు కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తుంటారు. ఇక సరైన సమయంలో రిలీజ్ చేయడం కూడా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు పెద్ద సవాల్. అందుకే దాదాపుగా వారాంతం, వరసగా హాలిడేస్ ఉండేలా స్టార్ హీరోల సినిమాలను అనౌన్స్ చేస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాను కూడా వరస సెలవుల టైం చూసే విడుదల చేశారు. పబ్లిక్ హాలిడేస్, పండగలు, వారాంతపు సెలవులు కలిసి వచ్చేలా వకీల్ సాబ్ రిలీజ్ చేశారు.

అసలే మూడేళ్ళ నుండి పవన్ సినిమా కోసం అయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండడం.. సినిమాకు పాజిటివ్ టాక్.. వరస హాలిడేస్ కలిసి రావడంతో సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తుంది. ఒకవైపు కరోనా విజృంభణ కొనసాగుతున్నా పవన్ మేనియా ముందు అదేం పెద్ద ఇబ్బంది కాలేదు. అయితే.. ఇప్పుడు అదే కరోనా వ్యాప్తి వకీల్ సాబ్ సినిమాకు కలిసివచ్చే అంశంగా మారింది. కరోనా దెబ్బతో రాబోయే సినిమాలన్నీ వాయిదా దిశగా వెళ్తున్నాయి. నాని నటించిన ‘టక్ జగదీష్’, రానా ‘విరాటపర్వం’, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ ఇప్పటికే వాయిదా వేసుకున్నారు.

ఇక ఆ తర్వాత రావాల్సిన గోపీచంద్ సీటీమార్ కూడా ధైర్యం చేసి థియేటర్లలోకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో వచ్చే నెల రోజులు వకీల్ సాబ్ ఒక్కడే థియేటర్లలో హోరెత్తించనున్నాడు. సినిమాకు వెళ్లాలనుకుంటే ప్రేక్షకుల ముందున్న ఒకే ఒక్క పెద్ద హీరో సినిమా వకీల్ సాబ్ ఒక్కటే అప్షన్ అవుతుంది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రదర్శన, థియేటర్లలో సీటింగ్ విషయంలో ప్రభుత్వాల నుండి ఎలాంటి ఆంక్షలు లేవు. ఒకవేళ ఆక్యుపెన్సీ తగ్గించినా వకీల్ సాబ్ ఒక్కడే థియేటర్లలో ఉంటాడు కనుక ఈ సినిమాకు వచ్చే ఢోకా లేదు. దీనిని బట్టి చూస్తే వసూళ్లలో వకీల్ సాబ్ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.