Vijay Devarakonda : రౌడీ హీరో ఖాళీగా ఉన్నాడా?? ఖుషీకి బ్రేక్ పడిందా? ముంబైకి మకాం..

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఏదోక సినిమాతో ఎంగేజ్ అయ్యిు ఉన్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. లైగర్ ఇచ్చిన సాలిడ్ పంచ్ కి ఇంకా డైలమాలోనే ఉన్న విజయ్ ఇప్పుడిప్పుడే................

Vijay Devarakonda : రౌడీ హీరో ఖాళీగా ఉన్నాడా?? ఖుషీకి బ్రేక్ పడిందా? ముంబైకి మకాం..

Vijay Devarakonda shift to mumbai wants to do a film in bollywood again

Updated On : November 25, 2022 / 10:29 AM IST

Vijay Devarakonda :  టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఏదోక సినిమాతో ఎంగేజ్ అయ్యిు ఉన్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. లైగర్ ఇచ్చిన సాలిడ్ పంచ్ కి ఇంకా డైలమాలోనే ఉన్న విజయ్ ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాడు. తెలుగులో వర్కవుట్ అయ్యే పరిస్తితులు లేవనుకున్నాడో ఏమో ముంబైలోనే పని వెతుక్కునే పనిలో ఉన్నాడు విజయ్.

విజయ్ దేవరకొండ లైగర్ దెబ్బతో డీలా పడిపోయాడు. ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన లైగర్ డిజాస్టర్ అయ్యి విజయ్ ఆశల మీద నీళ్లు చల్లింది. దాంతో విజయ్ ఆ ట్రాన్స్ లోనుంచి అంతగా బయటకు రాలేకపోతున్నాడు. లైగర్ ఆడలేదు. ఆ తర్వాత అనౌన్స్ చేసిన జనగణమన ఆగిపోయింది. ప్రస్తుతం శివనిర్వాణతో చేస్తున్న ఖుషీ కూడా సమంతకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో బ్రేక్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం విజయ్ ఖాళీ గానే ఉన్నట్టు సమాచారం.

Bollywod : బాలీవుడ్ ఇంకా భయపడుతోందా? ఓటీటీ వైపే బాలీవుడ్ చూపు..

తాజాగా ముంబైకి మళ్ళీ మకాం మార్చేసినట్టు తెలుస్తుంది. ముంబైకి విజయ్ దేవరకొండ ఓ యాడ్ షూట్ కోసం వెళ్లాడు. ఇప్పటికే చాలా కమర్షియల్ యాడ్స్ చేస్తున్న విజయ్ లేటెస్ట్ గా మరో యాడ్ చేయబోతున్నాడు. విజయ్ యాడ్ షూట్ తో పాటు బాలీవుడ్ లో స్టోరీ సిట్టింగ్స్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ తో దెబ్బతిన్న రౌడీ హీరో డిఫరెంట్ జానర్ లో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ తెలుగులో అందరు స్టార్ డైరెక్టర్లు ఎంగేజ్ అయ్యి ఉండడంతో బాలీవుడ్ డైరెక్టర్లతో మూవీ డిస్కషన్స్ అరేంజ్ చేసుకుంటున్నాడు విజయ్. పోయిన చోటే వెతక్కోవాలి అన్నట్టు బాలీవుడ్ లో ఆల్రెడీ తనకున్న క్రేజ్ కి కరణ్ జోహార్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి బాలీవుడ్ లో మంచి కమ్ బ్యాక్ ఇవ్వడానికి విజయ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మరి ఈ రౌడీ హీరో ఆ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.