నువ్వేంట్రా.. నా లవర్ని సినిమాకి రమ్మంటున్నావంటా..

Paagal: ‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా ‘పాగల్’.. నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు.
గురువారం ‘పాగల్’ టీజర్ రిలీజ్ చేశారు. సిమ్రాన్ చౌదరి కథానాయిక.. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. విశ్వక్ సేన తన నటనతో ఆకట్టుకున్నాడు.
హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. విజువల్స్, ఆర్ఆర్, చక్కగా కుదిరాయి. ఏప్రిల్ 30న ‘పాగల్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం : రధన్, కెమెరా : ఎస్.మణికందన్, ఎడిటర్ : గ్యారీ, నిర్మాత : బెక్కం వేణు గోపాల్.