యంగ్ ప్రొఫెషనల్స్‌కు ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఎందుకు సవాళ్లుగా మారిందంటే?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అప్పటినుంచి చాలామంది యంగ్ ప్రొఫెషనల్స్ ఇంటినుంచే (వర్క్ ఫ్రమ్ హోం) పనిచేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో కేవలం ఆఫీసు వర్క్ మాత్రమే కాదు.. మరెన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. కంటిన్యూగా ఇంటినుంచే పనిచేస్తుండటంతో ఇంట్లో పవర్ బిల్స్ అమాంతం పెరిగిపోయాయి. కానీ, చాలామంది ఇంటి నుంచి పనిచేసేవారంతా డబ్బులు ఆదా చేస్తున్నామని భావిస్తున్నారు. వారిని సత్యాభాన్ సింగ్ అనే వ్యక్తి కలవాలనుకున్నట్టు చెప్పాడు. తాను ఎదుర్కొన్న సవాళ్లను చెప్పాలని ఉందని అంటున్నాడు. 22ఏళ్ల సత్యాభాన్ ఢిల్లీలోని NGOలో పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ అయినప్పటి నుంచి ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. రెండు నెలల నుంచి కరెంట్ బిల్లు రెట్టింపు చెల్లించినట్టు చెప్పుకొచ్చాడు. సాధారణంగా తనకు కరెంట్ బిల్లు నెలకు రూ.1500 వరకు ఉండేది. గత నెలలో మాత్రం ఒక్కసారిగా రూ.3వేలు రావడంతో సింగ్ షాక్ అయ్యాడు. అంతకుముందు తాను ఎయిర్ కండీషన్ తక్కువగా వాడేవాడు.
ఇప్పుడు రోజులో మూడింట రెండు వంతులు ఏసీ నడుస్తూనే ఉంది. అందుకే పవర్ బిల్లు ఎక్కువగా వచ్చింది. అతడికి వచ్చే నెలజీతం కూడా పెద్దేమి కాదు. వచ్చే ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోం చేయాలంటే ఇంటర్నెట్ కూడా తప్పనిసరిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కరెంట్ వినియోగంతో పాటు ఇతర ఖర్చులు కూడా అదనంగా చేరాయి. తద్వారా బిల్లులు తడిసిమోపెడు అవుతున్నాయి. వర్క్ ఫ్రమ్ చేసేవారికి చాలా కంపెనీలు పరిహారాన్ని ఇవ్వడం లేదు. దానికితోడు జీతాల్లో కోత వేయడంతో మరింత కష్టంగా మారిందని అంటున్నాడు. బెంగళూరులోని శంశాక్ భరద్వాజ్ చెప్పిన ప్రకారం.. వర్క్ హోం సమయంలో తన ఫోన్ బిల్లు మూడు రెట్లు పెరిగిందని చెప్పాడు. తన కంపెనీ జీతాల్లో కోత విధించింది.
అంతకుముందు తన మొబైల్ ఇంటర్నెట్ వాడకం రోజుకు 750MB ఉండేది. బ్రాడ్ బ్యాండ్ కూడా.. తన మొబైల్ ఇంటర్నెట్ ద్వారా అనేక ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. దీంతో రోజుకు 5GB వరకు డేటా వాడేవాడు. ప్రతి నెలా రూ.800 చెల్లించాల్సిన డేటాకు అదనంగా రూ.2,500 వరకు పెరిగిపోయింది. సాధారణ పరిస్థితుల్లో అయితే అదనపు ఖర్చులపై కంపెనీ రీయింబర్స్ ఇవ్వాలని అడిగేవాడు. కానీ, కంపెనీ తనకు ఇవ్వాల్సిన జీతంలోనే కోత పెట్టింది. ఇంటి నుంచి పనిచేసే వారిలో చాలామంది ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నారు.
మరోవైపు టెక్ దిగ్గజాలు గూగుల్, ఫేస్ బుక్ సహా ఇతర కంపెనీలు తమ వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులను ప్రాంతాలవారీగా ఏడాది ఆఖరివరకు కొనసాగించాలని భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేశాయి. దీర్ఘకాలికంగా వర్క్ ఫ్రమ్ హోం కొనసాగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, అప్రయోజనాలు ఏంటి అనేదానిపై చర్చలు విస్తృతంగా జరుపుతున్నాయి.
Read: లాక్‌డౌన్ సమయంలో కంటినిండా నిద్రపోవాలంటే?