Woman Passenger: విమానంలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించిన మహిళ
రెండు కాళ్లను ముందు సీటుపై పెట్టింది. ఆ ముందు సీటులో ఓ ప్రయాణికుడు ఉన్నాడని, ఆయనకు ఇబ్బంది కలుగుతుందని కూడా ఆమె ఆలోచించలేదు.

Flight Woman
Woman Passenger: విమానంలో ఓ మహిళ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాల్ స్టాథార్డ్ అనే వ్యక్తి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఆయన పక్కన ఉన్న సీటులో ఓ మహిళ కూర్చుంది.. అయితే, అందరు ప్రయాణికుల్లా కాదు. రెండు కాళ్లను ముందు సీటుపై పెట్టింది. ఆ ముందు సీటులో ఓ ప్రయాణికుడు ఉన్నాడని, ఆయనకు ఇబ్బంది కలుగుతుందని కూడా ఆమె ఆలోచించలేదు.
Maharashtra: మంత్రి పదవులపై బీజేపీతో చర్చలు జరగలేదు: ఏక్‌నాథ్ షిండే
బూటు కాళ్లను అలాగే లేపి ముందు సీటుపై పెట్టి దర్జాగా కూర్చుంది. ఆమె ఫొటోను పాల్ స్టాథార్డ్ తీసి తన పక్క కూర్చున ఓ మహిళ తీరు ఇలా ఉందని చెప్పారు. ఆమె ప్రవర్తించిన తీరు పట్ల నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఇటువంటి వారిని మరోసారి విమానం ఎక్కనివ్వకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఫొటో చూశాక తనకు చాలా కోపం వచ్చిందని, తాను గనుక ఆ సమయంలో ఆ విమానంలో ఉంటే ఆమెపై ఫిర్యాదు చేసేవాడినని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఆ ఫొటో చూసి విస్మయానికి గురయ్యామని నెటిజన్లు అంటున్నారు.