Naga babu: వీరు అతి వాగుడు రోగంతో బాధ‌ప‌డుతున్నారు: నాగబాబు

''కొంద‌రు వైసీపీ నేత‌లు (ముఖ్యంగా మిస్ట‌ర్ పేర్ని నాని) అతి వాగుడు రోగంతో బాధ‌ప‌డుతున్నారు. వారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు పెట్టిన గ‌డ్డి అర‌గ‌క ఈ రోగం వ‌చ్చింది. మా పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గారికి ఓ విజ్ఞ‌ప్తి. వైసీపీ నేత‌ల‌కు అప్పుడ‌ప్పుడు అరిగే తిండి కూడా పెట్టండి'' అని నాగ‌బాబు పేర్కొన్నారు.

Naga babu: వీరు అతి వాగుడు రోగంతో బాధ‌ప‌డుతున్నారు: నాగబాబు

Janasena Nagababu

Updated On : July 11, 2022 / 8:48 PM IST

Naga babu: వైసీపీ నేత‌లు మాట్లాడుతున్న తీరుపై జ‌న‌సేన నేత నాగ‌బాబు చుర‌క‌లు అంటించారు. త‌మ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతున్న విష‌యాల‌ను వైసీపీ నేత‌లు జీర్ణించుకోలేకపోతున్నార‌ని చెప్పారు. ”కొంద‌రు వైసీపీ నేత‌లు (ముఖ్యంగా మిస్ట‌ర్ పేర్ని నాని) అతి వాగుడు రోగంతో బాధ‌ప‌డుతున్నారు. వారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు పెట్టిన గ‌డ్డి అర‌గ‌క ఈ రోగం వ‌చ్చింది. మా పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గారికి ఓ విజ్ఞ‌ప్తి. వైసీపీ నేత‌ల‌కు అప్పుడ‌ప్పుడు అరిగే తిండి కూడా పెట్టండి. బందరులో మిస్ట‌ర్ పేర్ని నానికి ద‌గ్గ‌ర‌లో ఉండే వైద్యుడు ఎవ‌రైనా ఆయ‌న‌కు ఏదైనా మందు ఇవ్వండి.. అతి వాగుడు త‌గ్గ‌డానికి” అని నాగ‌బాబు పేర్కొన్నారు.

salt: అద‌నంగా ఉప్పు తీసుకునే వారికి అకాల మ‌ర‌ణ ముప్పు

కాగా, ఇటీవ‌ల ప‌లువురు వైసీపీ నేత‌ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ప‌వ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌ను వైసీపీ నేత‌లు తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ వీకెండ్ సేవ చేస్తున్నారని, ఆయన షూటింగులకే కాకుండా రాజకీయాల్లోనూ ఆలస్యంగా పనులు చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు ఈ విధంగా స్పందించారు.