Delhi Boy Killed Family Members: ఢిల్లీలో మరో దారుణ ఘటన.. తల్లిదండ్రులతో సహా సోదరి, అమ్మమ్మను హత్యచేసిన యువకుడు..
25ఏళ్ల వయసున్న కేశవ్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. యువకుడు మాదకద్రవ్యాలకు వ్యసనపరుడుగా మారాడు. నిందితుడు డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ నుంచి ఇటీవలే విడుదలయ్యాడు. కుటుంబ సభ్యులపై కోపంతో మంగళవారం రాత్రి వారిపై దాడిచేశాడు.

Delhi Boy Killed Family Members
Delhi Boy Killed Family Members: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రద్దా హత్య ఘటన మరవకముందే ఓ యువకుడు కుటుంబంలోని తల్లిదండ్రులతో సహా మరో ఇద్దరిని హత్యచేశాడు. మంగళవారం రాత్రి 10.31 గంటల సమయంలో యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. తల్లిదండ్రులు, సోదరి, అమ్మమ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు.
25ఏళ్ల వయసున్న కేశవ్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. యువకుడు మాదకద్రవ్యాలకు వ్యసనపరుడుగా మారాడు. నిందితుడు డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ నుంచి ఇటీవలే విడుదలయ్యాడు. కుటుంబ సభ్యులపై కోపంతో మంగళవారం రాత్రి వారిపై దాడిచేశాడు. తల్లిదండ్రులు దినేష్ కుమార్ (42), ధర్శన్ సైనీ(40), అమ్మమ్మ దీవానో దేవి(75), సోదరి ఊర్వశి (22)లను కత్తితో పొడిచాడు. బలంగా కత్తితో పొడవడంతో వారు అక్కడిక్కడే మరణించారు.
Indonesia Earthquake: ఇండోనేషియాలో 268కి చేరిన మృతుల సంఖ్య.. 151మంది జాడలేదు..
కేశవ్ అరగంట వ్యవధిలో అందరినీ చంపేశాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. తొలుత తండ్రిని హత్యచేసిన కేశవ్.. అనుమానం రాకుండా బాత్ రూమ్‌లో మృతదేహాన్ని ఉంచాడు. తరువాత అమ్మమ్మను, తరువాత ఉద్యోగం నుంచి తిరిగి వచ్చిన తన తల్లిని, చివరిగా తన సోదరినికూడా కేశవ్ చంపేశాడు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే కేశవ్ ఈ దారుణానికి ఒడికట్టేందుకు కారణమయ్యాయని అన్నారు. యువకుడిపై కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.