Nandamuri Balakrishna: బాలయ్యకు యువరాజ్ సింగ్ బర్త్‌డే విషెస్..

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ ద్వారా బాలయ్యకు బర్త్‌డే విషెస్ చెప్పారు..

Nandamuri Balakrishna: బాలయ్యకు యువరాజ్ సింగ్ బర్త్‌డే విషెస్..

Yuvraj Singh Birthday Wishes To Nandamuri Balakrishna

Updated On : June 10, 2021 / 5:59 PM IST

Nandamuri Balakrishna: నటసింహ, హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ.. జూన్ 10న తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు..

ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు స్వయంగా కలిసి విష్ చెయ్యగా.. చాలా మంది సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ ద్వారా బాలయ్యకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ‘మీ ఎంటర్‌టైనింగ్ పర్ఫార్మెన్సెస్ మరియు సామాజిక కార్యక్రమాలతో ప్రపంచాన్ని ప్రేరేపించండి’ అంటూ బాలయ్యతో ఉన్న పాత ఫొటో షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు యువరాజ్ సింగ్.