Boost Immunity During Monsoon : వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవటం కోసం మీ ఆహారంలో చేర్చుకోవలసిన 4 అద్భుతమైన సూపర్‌ఫుడ్‌లు !
వర్షాకాలం పేగు ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా దానిని దృఢంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ప్రోబయోటిక్స్ అనేది లైవ్ గుడ్ బాక్టీరియా, ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మజ్జిగలో ఇంగువ , నల్ల ఉప్పు, ఇతర పులియబెట్టిన కూరగాయలు తీసుకుంటే పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Boost Immunity During Monsoon : వర్షకాలంలో మనం తినే ఆహారం విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు పాటించకుంటే ఆప్రభావం పేగు ఆరోగ్యంపై పడుతుంది. ఈ సీజన్లో అధిక తేమ స్థాయిలు, అనారోగ్యకరమైన పరిసరాలు , మురుగు నీరు, సూక్ష్మజీవుల పెరుగుదల కారణంగా కలుషితమైన నీరు అనేక కడుపు ఇన్ఫెక్షన్లు, కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి. ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు సర్వసాధారణం.
READ ALSO : Rainy Season Diseases : వర్షకాలంలో వీటి జోలికి వెళ్ళి రోగాలు కొనితెచ్చుకోకండి!
ఇలాంటి సందర్భంలో శరీరంలో బలమైన రోగనిరోధక శక్తి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వర్షాకాలంలో నీటిని మరిగించడం, కూరగాయలను శుభ్రంగా కడుక్కోవడం, చేతులను క్రమం తప్పకుండా శుభ్రపరచడం వంటి ఇతర జాగ్రత్తలు తీసుకుంటూనే, తీసుకునే ఆహారంపైన శ్రద్ధవహించాలి.
వర్షాకాలంలో పచ్చి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రేగులకు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను అందించాలి. పెరుగు, మజ్జిగ, ఊరగాయల వరకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ప్రోబయోటిక్ పులియబెట్టిన ఆహారాలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. మూలికలు , సుగంధ ద్రవ్యాలు రోగనిరోధక శక్తి పెంచటంలో అద్భుతాలు చేస్తాయి. వేప, అశ్వగంధ, నిమ్మరసం, అల్లం వంటివి అన్ని రకాల ఇన్ఫెక్షన్లు , వ్యాధులను అధిగమించడానికి ఉపయోగపడతాయి.
READ ALSO : వర్షకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, కూరగాయలు ఇవే!
వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేయటంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచే మార్గాలు ;
1. వండిన ఆహారాన్ని ఎక్కువగా తినండి ;
ఈ సీజన్లో సూక్ష్మజీవుల సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి పచ్చిగా తినడం కంటే వండిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. పచ్చి ఆహారాలు కడుపు నొప్పితోపాటు, ప్రేగులను బలహీనపరుస్తాయి. స్టైర్ ఫ్రై వెజిటేబుల్స్, సూప్‌లు, వండిన సబ్జీ వంటి పచ్చి , వండిన కూరగాయల కలయికతో తీసుకోండి. పచ్చి సలాడ్లలో కొంత భాగాన్ని తీసుకోండి. పండ్లను మనం తినడానికి ముందు బాగా కడుక్కోవాలి. యాపిల్, పియర్ వంటి పీచు పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి.
READ ALSO : Asthma Patients : వర్షకాలంలో ఆస్తమా రోగులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది!
2. హెర్బల్ టీని తీసుకోండి ;
హెర్బల్ టీలైన తులసి, పెప్పర్ కార్న్స్, హల్దీ, లెమన్ గ్రాస్, అల్లం మొదలైన మూలికల నుండి తయారు చేయవచ్చు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. చాయ్‌ని ఆస్వాదించాలనుకుంటే దాల్చినచెక్క, లవంగాలు, జాపత్రి వంటి మసాలా దినుసులు జోడించాలి. ఇది రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
READ ALSO : Yogurt Face Pack : వర్షకాలంలో చర్మాన్ని తాజాగా ఉంచే పెరుగు ఫేస్ ప్యాక్!
3. ఆహారంలో ప్రోబయోటిక్స్ చేర్చండి ;
వర్షాకాలం పేగు ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా దానిని దృఢంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ప్రోబయోటిక్స్ అనేది లైవ్ గుడ్ బాక్టీరియా, ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మజ్జిగలో ఇంగువ , నల్ల ఉప్పు, ఇతర పులియబెట్టిన కూరగాయలు తీసుకుంటే పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతి భోజనంలో ప్రోటీన్ మూలం ఉండేలా చూసుకోవాలి. మాంసకృత్తులు రోగనిరోధక వ్యవస్థలో భాగమైనందున రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి పప్పులు, పెరుగు, గింజలు లేదా నాన్-వెజ్ ఆహారాలు చాలా ముఖ్యమైనవి. అల్పాహారంలో పెరుగు, గింజలు లేదా ఓట్స్‌ను పాలతో చేర్చుకోండి. మధ్యాహ్న భోజనంలో పప్పులు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు స్నాక్స్ చేర్చవచ్చు. రాత్రి భోజనంలో ప్రోటీన్ యొక్క మూలంగా ఉండే పెరుగు, నాన్-వెజ్ ఆహారాలు తీసుకోవాలి.
READ ALSO : Prevent Cough and Cold : వర్షాకాలంలో దగ్గు, జలుబును ఎలా నివారించాలి ?
4. ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ :
ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అవిసె గింజలు, పుచ్చకాయ గింజలు, బాదం పప్పులు, వాల్నట్లు మరియు కొవ్వు చేపలు ఒమేగా 3 యొక్క మూలాలు. వీటిని ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.