Hair Health : మీ జుట్టు ఆరోగ్యం కోసం వీటిని తప్పనిసరిగా మీ ఆహారంలో చేర్చుకోండి!

బాదం, పిస్తా లాంటి గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. దీంతో పాటు సిట్రస్‌ ఆమ్లం ఉండే నిమ్మకాయలు, నారింజ పండ్లు తీసుకోవటం వల్ల కూడా జుట్టుకు మంచిది. విటమిన్ సి అనేది పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. అది ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఫ్రీరాడికల్స్ నుండి ఇబ్బందిని తొలగిస్తుంది.

Hair Health : మీ జుట్టు ఆరోగ్యం కోసం వీటిని తప్పనిసరిగా మీ ఆహారంలో చేర్చుకోండి!

Hair Health :

Updated On : January 4, 2023 / 9:42 AM IST

Hair Health : మనం తీసుకునే పోషక పదార్థాలు కూడా జుట్టుపై ప్రభావం చూపుతాయి. జుట్టు సమస్యలతో బాధ పడేవారు జుట్టు ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించే వారు తప్పనిసరిగా ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై అవగాహన కలిగి ఉండాలి. వయసు జెనిటిక్స్ మరియు హార్మోన్స్ ప్రభావం జుట్టు పైన పడుతుంది. అలానే మనం తీసుకునే పోషక పదార్థాలు కూడా జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తింటే జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. జుట్టు రాలడం లాంటి సమస్యలు ఉండవు.

విటమిన్ ఎ లోపం ఉండడం వల్ల జుట్టు రాలిపోతుంది. విటమిన్ ఎ జుట్టుకి కూడా చాలా ముఖ్యం. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండడం వల్ల జుట్టు త్వరగా ఎదుగుతుంది. విటమిన్ ఎ కోసం
చిలకడదుంపలు, క్యారెట్లు, గుమ్మడికాయ, పాలకూర మరియు కాలే వంటివి తీసుకోవాలి. అలాగే బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు కూడా జట్టుకు మేలు చేస్తాయి.
పాలకూరతో చేసిన ఆహారాన్ని తినటం వల్ల విటమిన్‌ ఎ, కె లభిస్తాయి. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బయోటిన్ లోపం ఉంటే జుట్టు రాలి పోవడం వంటి సమస్యలు వస్తాయి. విటమిన్ బి కూడా జుట్టు ఆరోగ్యానికి మంచిది. బాదం, మాంసం, చేప, ఆకు కూరల ద్వారా లభిస్తుంది. బీ12 సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు డైట్ లో చేర్చుకోవాలి. పప్పుధాన్యాలు తినటం వల్ల కూడా వీటిలో ప్రొటీన్లు, ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ముఖ్యంగా ప్రొటీన్ల వల్ల కుదుళ్లకు ఆక్సిజన్‌ చేరటం వల్ల జుట్టు పెరుగుదల బావుంటుంది.

బాదం, పిస్తా లాంటి గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. దీంతో పాటు సిట్రస్‌ ఆమ్లం ఉండే నిమ్మకాయలు, నారింజ పండ్లు తీసుకోవటం వల్ల కూడా జుట్టుకు మంచిది. విటమిన్ సి అనేది పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. అది ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఫ్రీరాడికల్స్ నుండి ఇబ్బందిని తొలగిస్తుంది. విటమిన్ సి స్ట్రాబెరీ, జామకాయ, మిరియాలు, సిట్రస్ ఫ్రూట్స్ లో మనకి ఉంటుంది కాబట్టి విటమిన్-సి ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవటం వల్ల జుట్టు ఎదుగుదల బాగుంటుంది.

విటమిన్ డి సరిగా లేక పోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. కాబట్టి విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. ఫ్యాటీ ఫిష్, కాడ్ లివర్ ఆయిల్, మష్రూమ్స్, ఫోర్టిఫైడ్ ఫుడ్స్ లో విటమిన్-డి ఉంటుంది కాబట్టి వీటిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. విటమిన్ ఈ కూడా జుట్టుకి చాలా ముఖ్యం. ఇదిలోపిస్తే జుట్టు రాలిపోతూ ఉంటుంది. సన్ ఫ్లవర్ సీడ్స్, బాదం, పాలకూర, అవకాడో వంటి వాటి ద్వారా లభిస్తుంది.