Apple Cider Vinegar : రాత్రి నిద్రపోయే ముందు ఒక్క టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు !

క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడేస్తుంది. నొప్పిని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది. ఆకలి వేయడానికి తోడ్పడుతుంది. టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉండడానికి ఉపయోగ పడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Apple Cider Vinegar : రాత్రి నిద్రపోయే ముందు ఒక్క టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు !

Apple Cider Vinegar :

Updated On : February 11, 2023 / 6:15 PM IST

Apple Cider Vinegar : బరువు తగ్గడానికి మరియు అందాన్ని పెంచుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ని చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఆపిల్ సైడర్ వెనిగర్ నుంచి వైట్ వెనిగర్ వరకు ఎన్నో రకాలని మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఆల్కహాలిక్ లిక్విడ్ ని ఫర్ మెంటేషన్ చేయడం వల్ల ఇది తయారవుతుంది. కొబ్బరి, అన్నం, ఖర్జూరం, తేనె ఇటువంటి పదార్థాలను ఉపయోగించి వెనిగర్ ని తయారు చేసుకోవచ్చు. ఆపిల్స్ ని ఫెర్మెంట్ చేసి ఒక పద్ధతి లో ఆపిల్ వెనిగర్ ని రూపొందించడం జరుగుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించటం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ని నియంత్రణలో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. పీహెచ్ లెవెల్స్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. అజీర్తితో బాధపడే వారికి ఇది మంచి రెమిడి. వృద్ధాప్య లక్షణాలు తగ్గిస్తుంది. కొవ్వును తగ్గించటంతోపాటు ఇది చర్మం నిగారింపుగా ఉంచుతుంది.

క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడేస్తుంది. నొప్పిని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది. ఆకలి వేయడానికి తోడ్పడుతుంది. టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉండడానికి ఉపయోగ పడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో విటమిన్ బి, పొటాషియం మరియు మెగ్నీషియం ఉన్నాయి, ఇవి సైనస్ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తగ్గించే శక్తి యాపిల్ సైడర్ వెనిగర్‌కి ఉంది. రాత్రి నిద్రకు ముందు 1 గ్లాసు నీళ్లలో 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ మరియు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకుంటే నోటిలోని బ్యాక్టీరియా తగ్గి ఉదయం నోటి దుర్వాసన తొలగిపోతుంది. రోజూ తాగడం వల్ల గొంతులోని బ్యాక్టీరియా ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది