జంతు ప్రేమ : పులులను దత్తత తీసుకున్న హీరో విజయ్ సేతుపతి
చెన్నై: సినిమాల్లో సందేశాలు ఇచ్చే హీరోలు చాలామంది ఉన్నారు. సమాజ సేవ గురించి, మంచి పనుల గురించి తెరపై లెక్చరర్లు దంచేస్తారు. కానీ రియల్ లైఫ్‌లోనూ వాటిని ఆచరించే

చెన్నై: సినిమాల్లో సందేశాలు ఇచ్చే హీరోలు చాలామంది ఉన్నారు. సమాజ సేవ గురించి, మంచి పనుల గురించి తెరపై లెక్చరర్లు దంచేస్తారు. కానీ రియల్ లైఫ్‌లోనూ వాటిని ఆచరించే
చెన్నై: సినిమాల్లో సందేశాలు ఇచ్చే హీరోలు చాలామంది ఉన్నారు. సమాజ సేవ గురించి, మంచి పనుల గురించి తెరపై లెక్చరర్లు దంచేస్తారు. కానీ రియల్ లైఫ్‌లోనూ వాటిని ఆచరించే వారు చాలా అరుదుగా ఉంటారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి అలాంటి కోవకే వస్తారు. సినిమాల్లో నీతులు చెప్పడమే కాదు నిజ జీవితంలోనూ ఆచరించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఓ మంచి పని చేసి రియల్ హీరో అనిపించుకున్నారు విజయ్ సేతుపతి.
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం
విజయ్ సేతుపతి జంతు ప్రేమను చాటుకున్నారు. 2 చిన్న తెల్ల పులులను దత్తత తీసుకున్నారు. చెన్నై వడలూర్‌లోని అరింగర్ జూ పార్క్‌లో పులుల సంరక్షణ బాధ్యతను విజయ్ స్వీకరించారు. వాటి సంరక్షణ కోసం జూ అధికారులకు 5లక్షల రూపాయలు ఇచ్చాడు. ఐదేళ్ల తెల్ల పులి ఆదిత్య, నాలుగున్నరేళ్ల ఆర్తిలను అడాప్ట్ చేసుకున్నారు. తాను పులులను దత్తత తీసుకోవడమే కాకుండా సమాజానికి మంచి మేసేజ్ కూడా ఇచ్చారు విజయ్ సేతుపతి.
ఏ విధంగా అయితే ప్రజలు బీచ్‌లు, షాపింగ్ మాల్స్ తరుచుగా సందర్శిస్తారో.. అదే విధంగా తమ పిల్లలతో తరుచుగా జూ ని కూడా విజిట్ చేయాలని, వాటి సంరక్షణ కోసం చేతనైన సాయం చేయాలని విజయ్ సేతుపతి పబ్లిక్‌కి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తనలా రూ.5లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు సాయం చేయొచ్చని సూచించారు.
Also Read : రాజకీయం కాదా! : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు
విజయ్ సేతుపతి సాయం పట్ల జూ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. విజయ్‌కి ధన్యవాదాలు చెప్పారు. రూ.5లక్షలు ఇవ్వడమే కాకుండా జూ ని విజిట్ చేయాలని, జంతువులను దత్తత తీసుకోవాలని విజయ్ పిలుపునివ్వడం అభినందించదగిన విషయం అన్నారు. జూ లో జంతువుల దత్తత కార్యక్రమం స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పటివరకు విరాళాల రూపంలో రూ.71లక్షలు వచ్చిందని జూ అధికారులు వివరించారు. 2019లో ఇదే ఫస్ట్ అడాప్షన్ అని జూ అధికారులు చెప్పారు. తమ హీరో చేసిన పనికి ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. రియల్ హీరో అని కితాబిస్తున్నారు.
Also Read : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ : టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు