Viral Video : ఆత్మీయులు ఎవరో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? జాస్మిన్ అరోరా స్టోరీ చదవండి
మన చుట్టూ చాలామంది ఉంటారు. కానీ వారిలో నిజంగా మనకు ఆత్మీయులు ఎవరు? ఎలాంటి సమయాల్లో తెలుస్తుంది? జాస్మిన్ అరోరా కథ చదవండి.

Viral Video
Viral Video : ఇంటర్నెట్‌లో కొన్ని వీడియోల్లో కనిపించే కథనాలు నవ్వు తెప్పిస్తాయి.. బాధ కలిగిస్తాయి.. కన్నీరు తెప్పిస్తాయి.. స్ఫూర్తి నింపుతాయి. అందరూ ఆత్మీయులు అనుకుంటాం.. కానీ ఎవరు నిజంగా మనవాళ్లు అనేది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అందరికీ అనుభవంలో ఉన్నా.. ఓ వైరల్ వీడియో చూస్తే ఇంకా అర్ధం అవుతుంది.
Carrier Success Tips : మీ చుట్టూ ఇలాంటి వారు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు
ఏ కష్టాలు లేని, రాని మనుషులు భూమీ మీద ఉండరు. చిన్నవో, పెద్దవో ఉండనే ఉంటాయి. ఆర్ధిక సమస్యలు కావచ్చు, అనారోగ్య కారణాలు కావచ్చు.. కుటుంబ సమస్యలు కావచ్చు ఫేస్ చేస్తూ ఉంటాము. జాస్మిన్ అరోరా (Jasmine Arora) అనే మహిళకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. officialpeopleofindia అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియో చూస్తే ఎమోషనల్ అవుతాం.
జాస్మిన్ అరోరా పెళ్లికి ముందు తన కాబోయే భర్తకి యువరాణిలా కనిపించిందట.. పెళ్లికి పదిరోజుల ముందు అనూహ్యంగా బరువు తగ్గడం మొదలుపెట్టిందట. పెళ్లైన తరువాత 40 కిలోలలు బరువు తగ్గిపోయిందట. ఆమె సమస్య ఏంటన్నది డాక్టర్లు సైతం కనిపెట్టలేకపోయారట. ఇక అత్తింటివారు మీ బిడ్డకి పెళ్లికి ముందు నుంచి అనారోగ్యం ఉందని జాస్మిన్ పేరెంట్స్‌ని తిట్టిపోశారట. పెళ్లైన 5 నెలలకి భర్త విడిచిపెట్టేశాడు. జాస్మిన్ దాదాపు రెండున్నరేళ్లు చావు బతుకులతో పోరాడింది. అద్దంలో తన ముఖం చూసుకోలేనంతగా 28 కిలోల బరువుకి వెళ్లిపోయిందట. అద్దంలో చూసుకుని కూతురు ఆత్మవిశ్వాసం కోల్పోతోందని జాస్మిన్ తల్లి ఇంట్లో అద్దాలు లేకుండా చేసిందట. ఆమె ఎంతో కఠినమైన రోజుల్ని చూసిన టైమ్‌లో తన ఫ్యామిలీ మాత్రమే పక్కన నిలబడిందట.
కొన్ని నెలలు గడిచిన తర్వాత జాస్మిన్ జీవితంలో మిరాకిల్ జరిగింది. బరువు పెరడటంతో పాటు ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవడం మొదలుపెట్టింది. ఆమెలో ఎంతటి శక్తి వచ్చిందంటే తిరిగి తన డ్రీమ్ జాబ్‌లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం జాస్మిన్ సంతోషంగా ఉంది. జాస్మిన్ బలమైన నమ్మకం ఏంటో తెలుసా? మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనతో ఉంటారో వాళ్లే మనవాళ్లు..ఆత్మీయులు. నిజమే కదా..ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సమస్య వచ్చినా ఆత్మవిశ్వాసంతో దానిని జయించిన జాస్మిన్ కథ స్ఫూర్తి నింపుతోంది.
View this post on Instagram