Dandiya Benefits : దాండియాతో ఫిట్‌నెస్‌ .. ఆటతో ఆనందమే కాదు అందం కూడా మీ సొంతం

శరన్నవరాత్రుల్లో చేసే దాండియా నృత్యం శరీరానికి చక్కటి ఆరోగ్యాన్నిస్తుంది. మంచి ఫిట్ నెస్ ను కలిగిస్తుంది. మనస్సుకు చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది.

Dandiya Benefits : దాండియాతో ఫిట్‌నెస్‌ .. ఆటతో ఆనందమే కాదు అందం కూడా మీ సొంతం

Body Benefits of Dandiya

Updated On : October 24, 2023 / 1:36 PM IST

Benefits of Dandiya: భారతదేశంలో పండుగల్లో భక్తి మాత్రమే ఆరోగ్య ప్రయోజనాల మేళవింపుగా ఉంటాయి. భారత్ లో హిందువుల చేసుకునే పండుగల గురించి ఆలోచించి చూస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల మేళవింపుగా ఉంటాయనే విషయం అర్థమవుతుంది. హిందు పండుగల్లో ఆడే ఆటలు, పాడే పాటలు, దైవాలకు పెట్టే ప్రసాదాలు ఇలా అన్నీ ఆరోగ్యాలను..ఆనందాలను కలిగించే ప్రక్రియలు కనిపిస్తాయి.ఆయా రోజుల్లో వచ్చే పండుగల్లో దేవుళ్లకు నైవేద్యాలుగా సమర్పించే ప్రసాదాల్లో ఎన్నో ఆరోగ్యప్రయోజాలు ఉన్నాయి. వినాయక చవితి, దీపావళి, అట్టతద్దె, ఉగాదికి తయారు చేసుకునే ఉగాది పచ్చడి..ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో ఆరోగ్యాల మేళవింపు హిందు పండుగల్లో ప్రస్పుటంగా కనిపిస్తాయి.అంతేకాదు పండుగలకు ఆడే ఆటల్లో కూడా చక్కటి ఆరోగ్యాలు కలిగిస్తాయి.

శరీరానికి శక్తినిచ్చే బతుకమ్మ ఆటలు..
బతుకమ్మ ఆటలు ఆడేటప్పుడు చప్పట్లు కొట్టటం..వండి లేచి ఆడే ఆటలు వంటివి చక్కటి ఫిట్ నెస్ ను కలిగిస్తాయి. చప్పట్లు కొట్టటం..చప్పట్లు కొడితే శరీరంలో రక్తప్రసరణ చాలా చక్కగా జరుగుతుంది. చప్పట్లు ప్రోత్సహాలకు,అభినందనలకు ప్రతీక. అటువంటి చప్పట్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఆ సమయంలో మనం శరీరంలో చాలా ఎనర్జిటిక్ వేవ్స్ కలుగుతాయి. ఆనందం ప్రదర్శించటం ద్వారా ఎనర్జిటిక్ వేవ్స్ శరీరానికి మంచి టానిక్ లా ఉపయోగపడతాయి. చప్పట్లు శరీరానికి శక్తినిస్తాయి.

ఫిట్ నెస్ ను కలిగించే దాండియా డ్యాన్స్..
అలాగే శరన్నవరాత్రుల్లో చేసే దాండియా నృత్యం కూడా శరీరానికి చక్కటి ఆరోగ్యాన్నిస్తుంది. మంచి ఫిట్ నెస్ ను కలిగిస్తుంది. మనస్సుకు చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవిని పూజిస్తూ దాండియా నృత్యాలు చేయడం గుజరాతీ, రాజస్థానీల ఆచారం. నార్త్‌ ఇండియాలో పుట్టిన ఈ డ్యాన్స్ ఇప్పుడు ప్రపంచమంతా ఫేమస్‌ అయ్యింది.దసరా ఉత్సవాల్లో దాండియా ఆటలు కనువిందు చేస్తాయి. ఆడేవారికి చూసేవారికి కూడా చక్కటి ఆనందాన్ని కలిగిస్తాయి. దాండియా డ్యాన్సులు అందరికి ఒకచోట చేర్చి సంఘీభావానికి ప్రతీకగా నిలుస్తాయి. అంతేకాదు దాండియా డ్యాన్సన్ ఆనందించడానికి ఆడుకునే ఆటలు మాత్రమే కావు.. ఇది ఆరోగ్యపరంగా, ఫిట్‌నెస్‌ పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దాండియా డ్యాన్స్..
దాండియా డ్యాన్స్ చేసేవారిని పరిశీలించి చూస్తే వారు డ్యాన్స్ చేసే సయమంలో చక్కగా ఆస్వాదిస్తు చేస్తారు. అలా దాండియా మానసిక ఒత్తిడికి తగ్గిస్తుంది. తొమ్మిది రాత్రులు దాండియా ఆడి..ఆడి అలసిపోవటం వల్ల చక్కటి సఖ నిద్రపడుతుంది. దీంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా ఒత్తిడి ఉంటే దాండియా ఆడితే తగ్గుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. దాండియా ఆడుతున్నప్పుడు మెదడులో ఎండార్ఫిన్లు డెవలప్ అవుతాయట. ఇవి ఒత్తిడి, ఆందోళన.. వంటి మానసిక సమస్యలను దూరచేసి శరీరాన్ని, మనసును ప్రశాంతనిస్తాయట.

ఏరోబిక్స్ లా పనిచేసే దాండియా..
దాండియా మంచి ఏరోబిక్స్ ఎక్సైర్ సైజులా పనిచేస్తుంది. దాండియా డ్యాన్స్ చేసే సమయంలో సరిగ్గా గమనిస్తే తల నుంచి కాలి వేళ్ల వరకు చక్కగా కదులుతుంటాయి. అంటే శరీరం అంతా చక్కటి విల్లులా వంగి ఎంతో హాయినిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు దాండియా చక్కటి టానిక్ లా పనిచేస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగి నొప్పులు వంటివాటిని దూరం చేస్తుంది. దాండియాను స్పీడ్ గా ఆడితే గుండె కొట్టుకునే వేగం కూడా పెరిగి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దాండియా చేస్తే చక్కటి కదలికలకు శరీరంలోని చెడు కొవ్వులు కరిగిపోతాయి. చక్కటి శరీరాకృతికి దాండియా బెస్ట్ అంటున్నారు నిపుణులు. ఈ తొమ్మిది రాత్రులు దాండియా డ్యాన్స్ వల్ల బరువు తగ్గుతారు. చేతులు, కాళ్లు, తల, నడుము ఇలా శరీరంలో ప్రతీ అవయవం చక్కగా వంపులు తిరగటం వల్ల బరువు తగ్గేలా చేస్తుంది. అంతేకాదు దాండియా డ్యాన్స్ లోని రకరకాల భంగిమలు నడుమును నాజూకుగా చేస్తాయి.

దాండియాలో కోలాటం..
దాండియాలో కర్రలతో కొట్టుడు ఆడే కోలాటం కూడా చక్కటి మానసిక  ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.లయ బద్దంగా కర్రలతో కోలాటం కొడుతు..లయబద్దంగా కదిలే పాదాలు ఇలా కోలాటం ఆటలో మరో ప్రత్యేకత. కోలాటం కర్రలతో కొట్టే శబ్దం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శరీరాన్ని వంచుతు..గిరగిరా తిరుగుతు ఆడే ఈ దాండియా డ్యాన్స్ లో లయ బద్దమైన శబ్దం..లయ బద్దమైన డ్యాన్స్ అంతా ఆరోగ్యాల ప్రయోజనాలకు కలిగిస్తుంది.