Vegetables : మాంసంలో లేని ప్రత్యేకతలు కూరగాయల్లో ఉన్నాయా?

పండ్లను, కాయగూరలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటిలోని ఇనుముకు సంబంధించిన ఫోలిక్ యాసిడ్ అనేది శరీరానికి బాగా వంటబడ్తుంది.

Vegetables : మాంసంలో లేని ప్రత్యేకతలు కూరగాయల్లో ఉన్నాయా?

Vegetables (1)

Vegetables : పళ్ళు, కూరగాయలు ఎందుకు తినాలంటే వాటిలో సూక్ష్మ పోషకాలు నెలకొని ఉంటాయి. వాటిలో ఉండే లవణాలు, ఖనిజాలు అతి కొద్ది మోతాదులో మనిషికి జీవితకాలం అవసరమౌతాయి. కోబాల్ట్, రాగి, అయొడిన్, మ్యాంగనీసు, జింక్ లాంటి ఖనిజాలు, ఇంకా ఇతర విట మిన్లు ఎక్కువగా రోజుకు 100 మి.గ్రా, మోతాదు వరకూ అవసరం అవుతాయి. తక్కువ మోతాదులో ఎక్కువ శక్తిదాయకమైన వీటిని సూక్ష్మ పోషకాలంటారు. ఇవి పళ్ళలోను, కూరగాయల్లోను అత్యధికంగా ఉంటాయి. పీచు పదార్థాలు, పిండిపదార్ధాల్లాంటి పోషకాలు ఎక్కువ మోతాదులో శరీరానికి అవసరం అవుతాయి. కాబట్టి వీటికా

ఇవి కాక శరీరం తన పనిని తాను సమర్థవంతంగా చేసుకునేందుకు కావలసిన పోషకాలను మొక్కలు మాత్రమే మన శరీరానికి అందిస్తాయి. వీటిని పైటోన్యూట్రియంట్స్ అంటారు. ఇవి మొక్కల్లో ఫంగస్ లాంటి చీడ పట్టకుండా కాపాడే రక్షణ యంత్రాంగానికి సంబంధించినవి. మొక్కలకు సంబంధించిన వాటిని ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ రక్షక రసాయనాలు పూర్తిస్థాయిలో మనకు అందుతాయి. కేవలం మాంసాహారం మీద ఆధారపడితే ఇవి చాలినన్ని అందకుండా పోతాయి.

కాషాయం రంగు కూరగాయల విషయానికి వస్తే పిల్లల్లో కంటి చూపు పెరగడానికి, చర్మం మృదుత్వం, లావణ్యం పొందడానికి, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఏ విటమిని అవసరం అవుతుంది. కేరట్లు, టమోటాలు, చిలకడదుంపలు, బొప్పాయి, మామిడి పండు లాంటి ఎరుపు రంగు కలిగిన పండ్లు, కాయగూరల్లో కెరటోనాయిడ్స్ అనే పోషకాలు శరీరానికి రక్షణ కలిగించే ద్రవ్యాలను బాగా అందిస్తాయి.

టమోటాలాంటి కూరగాయల్లోనూ, జామ అరటి లాంటి పండ్లల్లో ఉండే సి విటమిన్ పూర్తిస్థాయిలో మనం ఉపయోగించుకో లేకపోతున్నాం. వాటిని అధిక ఉష్ణోగ్రత దగ్గర వండటం కారణంగా సి విటమిన్ పోతుంది. సాంబారు, పప్పుచారు, కలగూర పప్పు లాంటివి వండినప్పుడు పొయ్యి మీంచి దించబోయే ముందు టమోటా రసం కలపటం మంచిది. సి విటమిన్ ఎక్కువ సేపు ఉడికిస్తే త్వరగా ఆవిరైపోతుంది. అంతేకాకుండా కూర రుచి కూడా దెబ్బతింటుంది.

పండ్లను, కాయగూరలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటిలోని ఇనుముకు సంబంధించిన ఫోలిక్ యాసిడ్ అనేది శరీరానికి బాగా వంటబడ్తుంది. పీచుపదార్ధాల విషయానికి వస్తే కాయగూరల్లోనూ, ఆకు కూరల్లోనూ అధికంగా ఉండే పీచుపదార్థాలు జీర్ణశక్తిని పెంచుతాయి. పేగులను బలసంపన్నం చేస్తాయి. రోజూ సకాలంలో విరేచనం అయ్యేలా చేస్తాయి. పేగుల్లో కేన్సర్ లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కాపాడతాయి. పీచుపదార్థాలతో నిండిన ఆహారం తీసుకున్నప్పుడు కొవ్వు పదార్థాలు, పంచదార పదార్థాలు రక్తంలోకి ఎక్కువగా చేరకుండా అవి అడ్డుకుంటాయి. స్థూలకాయం, షుగరు వ్యాధుల్నిఅదుపులో పెట్టడానికి పీచుపదార్థాల అవసరం ఎంతైనా ఉంది.

కూరల్ని అతిగా చింతపండు, అల్లం, వెల్లుల్లి మసాలాలు వేయకుండా వండుకుంటే కూర ఎక్కువగానూ, అన్నం తక్కువగానూ తినటం సాధ్యం అవుతుంది. ఏ కూరగాయనైనా నూనెలో బాగా వేయిస్తే ఆ కూరగాయ ప్రబావం సగం చచ్చిపోతుంది. పోషకాలు మాడి పోతాయి. అతిగా వేగడం వలన అందులో కేన్సర్ కారకమైన ఆకీలమైడ్ అనే విషరసాయనం పుడుతుంది. కూరగాయలను తేలికగా ఉడికించుకుని కూరలు తయారు చేసుకోవాలి.

మాంసాహారానికి ప్రత్యామ్నయంగా కూరగాయలను, పప్పుధాన్యాలను, తీసుకోవచ్చు. కానీ కూరగాయలకు మాంసాహారం ప్రత్యామ్నాయంకానే కాదు. కూరగాయల్లోని పోషకాలు తేలికగా అరిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇటీవల కాలంలో పనస ముక్కల పలావ్, దొండకాయ టిక్కాలాంటి వంటకాలు మాంసాహారాన్ని వండే పద్ధతిలో కూరగాయల్ని ఎక్కువగా వండుతున్నారు. ఇలా వండటం వల్ల ఆహారం విషతుల్యం అవుతుంది. కొద్దిపాటి వేడి మీద కొంచెంసేపు ఉడకనిస్తే కూర తినడానికి రుచిగానూ, ఆరోగ్యదాయకం గానూ ఉంటుంది.