Bathing In Winter : శీతాకాలంలో చలి కారణంగా స్నానం చేయటం మానేస్తున్నారా? ఆ సమస్యలు తప్పువు !

శీతాకాలంలో స్నానం చేయకపోతే శరీరంపై మృతకణాలు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా గజ్జ ప్రాంతంలో మృతకణాల వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.

Bathing In Winter : శీతాకాలంలో చలి కారణంగా స్నానం చేయటం మానేస్తున్నారా? ఆ సమస్యలు తప్పువు !

Avoiding bathing in winter due to cold? Those problems are wrong!

Updated On : November 18, 2022 / 3:30 PM IST

Bathing In Winter : బయట గజగజ వణికే చలి దీంతో స్నానం చేయటమంటేనే పెద్ద సాహసం చేసినట్లుంటుంది చాలా మందికి. చలిని సాకుగా చూపి స్నానం చేసేందుకు బద్ధకిస్తూ ఉంటారు. చలికాలంలో చలికారణంగా వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. మరికొందరైతే వేడినీటితో స్నానం చేస్తుంటారు. చలికాలంలో వాతావరణం ప్రభావం వల్ల స్నానం చేయాలన్న ఆలోచనే చాలా మందిలో ఉండదు. అయితే చలికాలంలో స్నానం రోజు చేయకుంటే మాత్రం చర్మ సంబంధ వ్యాధులు, సీజనల్ వ్యాధులు త్వరగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శీతాకాలంలో స్నానం చేయకపోతే శరీరంపై మృతకణాలు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా గజ్జ ప్రాంతంలో మృతకణాల వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. క్రమేపి శరీరంలోని ఇతర భాగాలకు మరింత వ్యాప్తి చెందుతాయి. స్నానం మానేయడం వల్ల శరీరంలోని వివిధ భాగాలలో మృతకణాలు బాగా పేరుకుపోయి ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

అంతేకాకుండా స్నానం లేకపోతే బాక్టీరియా శరీరం అంతటా వ్యాప్తి చెంది చెడు వాసన వస్తుంది. ఇది అసహ్యకరమైన వాసనతో పాటు వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. స్నానం చేయని వారిలో శరీరంలో ఉండే వైరస్, బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతాయి. తద్వారా శరీరంలోని రోగనిరోధక శక్తిని మరింత తగ్గించి ఇన్ఫెక్షన్లకు గురి చేస్తాయి.

చలికాలంలో హెయిర్ లాస్ ఎక్కువగానే ఉంటుంది. రాత్రి సమయంలో మంచులో తిరిగి తలస్నానం చేయకుంటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. పైగా స్కాల్ప్​పై దురద వంటి సమస్యలు వస్తాయి. ఇవి హెయిర్ లాస్​ను మరింత పెరిగేలా చేస్తాయి. స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రంగా ఉంటుంది. స్నానం చేయకపోతే మాత్రం చర్మవ్యాధులు, సీజనల్ వ్యాధులు త్వరగా వచ్చే ప్రమాదం ఉంటుంది.