Barley Water : బరువును తగ్గించే బార్లీ వాటర్!

బార్లీ లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది. ఆకలి తగ్గటంలో ఇందులో ఉండే బీటా గ్లూకాన్ అని పిలువబడే కరిగే ఫైబర్ ఇందుకు సహాయపడుతుంది. బార్లీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరచడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువును తగ్గించటంలో బార్లీ సహాయపడుతుంది.

Barley Water : బరువును తగ్గించే బార్లీ వాటర్!

Barley Water

Updated On : July 29, 2022 / 1:48 PM IST

Barley Water : బార్లీ గింజలు ఆహారంగా, ఔషదంగా ఉపయోగపడుతుంది. వోట్స్‌కు బదులుగా బార్లీ ని అల్పాహారము, గంజి రూపంలో తీసుకోవచ్చు. సూపులు, ఇతర వంట రకాలలో కూడా వాడవచ్చు. బార్లీ పిండిని గోధుమ పిండితో కలిపి రొట్టె తయారు చేసుకొని తినవచ్చు. బార్లీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యముగా స్త్రీలు ఎదుర్కొనే సమస్యలో మూత్ర ఇన్ ఫెక్షన్స్ కూడా ఒకటి. ఈ సమస్యను అదుపులో ఉంచేందుకు ఉదయము పూట ఒక గ్లాస్ బార్లీ నీళ్ళు తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. మూత్రపిండాలలో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి.

బార్లీ లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది. ఆకలి తగ్గటంలో ఇందులో ఉండే బీటా గ్లూకాన్ అని పిలువబడే కరిగే ఫైబర్ ఇందుకు సహాయపడుతుంది. బార్లీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరచడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువును తగ్గించటంలో బార్లీ సహాయపడుతుంది. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. కొవ్వు, కొలెస్ట్రాల్, చక్కెర శాతం చాలా తక్కువ. ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల బార్లీ బరువు తగ్గటానికి అనువైన పోషకాహారంగా నిపుణులు సూచిస్తున్నారు.

బార్లీ నీటిని తాగటం ద్వారా శరీరంలో కేలరీలు ఖర్చవుతాయి. జీవక్రియను వేగవంతం చేయటంలో తోడ్పడటం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. రోజుకు రెండు గ్లాసులు బార్లీ నీటిని తాగవచ్చు. క్రమం తప్పకుండా బార్లీ నీటిని తాగటం వల్ల ఊబకాయం తగ్గుతుంది. బార్లీలో ఉండే పెక్టిన్ రక్తంలోని కొలెస్టరాల్ తగ్గిస్తుంది. నిమ్మకాయ, తేనెతో కలిపి బార్లీ నీటిని తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అనారోగ్యంతో బాధపడేవారు రోజూ బార్లీ గంజిని తాగితే బలహీనత, నీరసం తగ్గిపోతుంది.