Ridge Gourd : రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రణలో ఉంచే బీరకాయ!

విటమిన్ ఎ గణనీయమైన మొత్తంలో ఉండటం వల్ల పెద్ద వయసు వారిలో కంటి చూపు మెరుగుపడుతుంది. పాక్షిక అంధత్వం,ఇతర కంటి వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Ridge Gourd : రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రణలో ఉంచే బీరకాయ!

Ridge Gourd

Updated On : July 5, 2022 / 6:12 PM IST

Ridge Gourd : బీరకాయ అనేక పోషకాలు కలిగిన కూరగాయ. సహజంగా చప్పగా ఉండే రుచిని కలిగి ఉండే పచ్చటి కండగలిగి ఉంటుంది. ఇందులో డైటరీ ఫైబర్స్, వాటర్ కంటెంట్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం మరియు విటమిన్ బి6 వంటి ముఖ్యమైన భాగాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది సహజంగా తక్కువ కేలరీల కంటెంట్, అనారోగ్యకరమైన సంతృప్త కొవ్వులు , కొలెస్ట్రాల్. ఇంకా, ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. శరీరం నుండి విషపదార్ధాలను తొలగిస్తాయి.

అంతర్గత మంటలను తగ్గించడానికి, దగ్గును తగ్గించడానికి, శోషరస గ్రంథుల వాపును తగ్గించడానికి బీరకాయ ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలలో బీరకాయ ఒకటి. బీరకాయ తినడం వలన ప్యాంక్రియాస్ ని ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటట్టు ఆక్టివేట్ చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు వారంలో రెండు లేదా మూడుసార్లు బీరకాయ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బీరకాయలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. బీరకాయలోని పోషకాలు రక్తంలో, యూరిన్ లో చక్కెర స్థాయిలను కలవకుండా అడ్డుకుంటాయి. బీరకాయలో పెప్టైడ్స్‌, ఆల్కలాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడతాయి.

విటమిన్ ఎ గణనీయమైన మొత్తంలో ఉండటం వల్ల పెద్ద వయసు వారిలో కంటి చూపు మెరుగుపడుతుంది. పాక్షిక అంధత్వం,ఇతర కంటి వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే బీరకాయను కూరగా చేసినప్పుడు మనలో చాలా మంది పై తొక్క పూర్తిగా తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా బీరకాయ మీద ఉన్న ఈనెలను మాత్రం తీసి కూరగా వండుకోవాలి. అప్పుడే బీరకాయలో ఉండే పోషకాలు అన్నీ మన శరీరానికి అందుతాయి. బీరలో సెల్యులోజ్‌ సమృద్ధిగా ఉంటుంది, బీరకాయ తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.